Begin typing your search above and press return to search.

గుబులు రేపుతున్న ర‌కుల్ అల్ట్రా గ్లామ్ లుక్

By:  Tupaki Desk   |   5 Sep 2022 4:14 AM GMT
గుబులు రేపుతున్న ర‌కుల్ అల్ట్రా గ్లామ్ లుక్
X
టాలీవుడ్ టు బాలీవుడ్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌యాణం గురించి తెలిసిందే. ద‌క్షిణాదిన ఈ భామ‌కు అవ‌కాశాలు త‌గ్గే క్ర‌మంలో ముంబై ప‌రిశ్ర‌మ‌లో న‌టించేందుకు సంత‌కాలు చేస్తోంది. అక్క‌డ అజ‌య్ దేవ‌గ‌న్ స‌హా ప‌లువురు హీరోల అండ‌తో కెరీర్ బండిని సాగిస్తోంది. ఇక తెలుగులో ర‌కుల్ న‌టించిన చివ‌రి చిత్రం కొండ పొలం ఫ్లాప్ షోగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల‌ తెలుగులో ర‌కుల్ కి ఛాన్సులేవీ లేవు.

బాలీవుడ్ లో గ్లామ‌ర్ షోతో హీటెక్కిస్తున్న ర‌కుల్ ఇప్పుడు జీరో సైజ్ కి మార‌డం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవ‌ల ఈ పంజాబీ బ్యూటీ అల్ట్రా గ్లామ‌ర‌స్ లుక్ లోకి మారింది. నిరంత‌రం జిమ్ యోగా అంటూ బాగానే శ్ర‌మిస్తోంది. తాజాగా ర‌కుల్ షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ త‌న సైజ్ జీరో లుక్ ని ఆవిష్క‌రించింది. ఈ లుక్ లో అమ్మ‌డు ఎంతో హాట్ గా క‌నిపిస్తోంది. క్రిస్టలైన్ షిమ్మ‌రీ టాప్ లో ర‌కుల్ టాప్ లేపింద‌ని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అలాగే కొంత గ్యాప్ త‌ర్వాత త‌న‌కు ఉన్న ప‌రిచ‌యాల‌తో తెలుగులో మ‌రో ఛాన్స్ కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌ని స‌మాచారం. ఇది ఎంత‌వ‌ర‌కూ వ‌ర్క‌వుట‌వుతుంది? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇటీవ‌ల‌ ర‌కుల్ 'మషూకా' సాంగ్ లో త‌న‌వైన స్టెప్పుల‌తో అలరించింది. ఈ వీడియో హిందీలో విడుదలైంది. విజువల్స్.. కొరియోగ్రఫీ .. సాహిత్యం ఇలా ప్ర‌తిదీ దేనిక‌దే ప్ర‌త్యేకంగా క‌నిపించాయి. తనిష్క్ బాగ్చి సంగీతం అందించిన ఈ ఆల్బ‌మ్ తెలుగు- తమిళ భాషల్లోను విడుద‌లైంది. అజయ్ దేవగన్ స‌ర‌స‌న న‌టించిన‌ 'రన్ వే 34' ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.

త‌దుప‌రి చత్రివాలి స‌హా ప‌లు చిత్రాల‌లో న‌టిస్తోంది. ఇటీవ‌లే న‌టుడు నిర్మాత జాకీ భ‌గ్నానీతో డేటింగ్ ని ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే. అత‌డు నిర్మిస్తున్న సినిమాల్లోనూ ర‌కుల్ న‌టిస్తోంది. అర్జున్ కపూర్ - భూమి పెడ్నేకర్ జోడీ ది లేడీ కిల్లర్స్ లో ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. ఈ ముగ్గురూ తమ తదుపరి ప్రాజెక్ట్ కోసం ప్రిప‌రేష‌న్ లో ఉన్నారు. 'మేరీ పత్నీ కా రీమేక్' అనే తాత్కాలిక టైటిల్ వైర‌ల్ అవుతోంది. 'హ్యాపీ భాగ్ జాయేగీ' దర్శకుడు ముదస్సర్ అజీజ్ మొదటిసారిగా అర్జున్- ర‌కుల్ బృందంతో ప‌ని చేస్తున్నారు. ఇది క్రేజీ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్.

ఇంత‌కుముందు'సర్దార్ కా గ్రాండ్ సన్' లో అర్జున్ కి ప్రియురాలిగా ర‌కుల్ న‌టించింది. తాజా చిత్రం 90ల నాటి గోవిందా కామెడీ నాస్టాల్జిక్ మెమరీగా రూపొందుతుండ‌గా ర‌కుల్ కి మ‌ళ్లీ అర్జున్ స‌ర‌స‌న‌ ఛాన్స్ ద‌క్కింది. పూజా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వాసు భగ్నాని నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక నిర్మాత జాకీ భ‌గ్నానీతో ప్రేమ‌లో ఉన్న ర‌కుల్ ప్రీత్ సింగ్ అత‌డి సొంత కుటుంబ బ్యాన‌ర్ల‌లో న‌టించేందుకు ఆస‌క్తిగా ఉంది. డాక్ట‌ర్ జి- అయ‌లాన్- థాంక్ గాడ్- భార‌తీయుడు 2 - ఛ‌త్రివాలి చిత్రాలు విడుద‌ల‌కు రావాల్సి ఉంది. 31 అక్టోబ‌ర్ లేడీస్ నైట్ అనే ద్విభాషా చిత్రంలోనూ ర‌కుల్ న‌టిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.