Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : తళుకుమన్నది కులుకుల తార.. పలుకుతున్నది వలపు సితార..!

By:  Tupaki Desk   |   26 Oct 2022 1:30 PM GMT
ఫోటో స్టోరీ : తళుకుమన్నది కులుకుల తార.. పలుకుతున్నది వలపు సితార..!
X
కన్నడ గిల్లి సినిమాతో తెరంగేట్రం చేసిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో కెరటంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో అమ్మడి నటన చూసి మేర్లపాక గాంధి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఆ సినిమా హిట్ అవడంతో రకుల్ కి సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత రఫ్, లౌఖ్యం, కరెంటు తీగ, పండుగ చేస్కో సినిమాల్లో నటించింది. వీటిలో లౌఖ్యం హిట్ అమ్మడికి మంచి మైలేజ్ తీసుకొచ్చింది. ఆ క్రేజ్ తోనే చరణ్ బ్రూస్ లీ సినిమాలో క్రేజీ ఛాన్స్ అందుకుంది. బ్రూస్ లీ ఫ్లాప్ అయినా సరే ఆ వెంటనే ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో.. సరైనోడు సూపర్ హిట్లు అందుకుంది రకుల్.

బ్రూస్ లీ తర్వాత చరణ్ తో మరోసారి ధృవ సినిమాలో కలిసి నటించింది. తని ఒరువన్ రీమేక్ గా వచ్చిన ఆ సినిమా కూడా రకుల్ ఖాతాలో సూపర్ హిట్ ఇచ్చింది. కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న టైం లో యువ హీరోలతో నటించడం వల్ల ఆ సినిమాలు నిరాశపరచడమే కాకుండా రకుల్ కెరియర్ ని రిస్క్ లో పడేశాయి. అప్పటికే రకుల్ పని అయిపోయింది అనుకుంటున్న టైం లో మహేష్ స్పైడర్ సినిమా మరో షాక్ ఇచ్చింది. ఆ దెబ్బతో టాలీవుడ్ కి బై బై చెప్పేసింది రకుల్.

మధ్యలో ఎన్.టి.ఆర్ కథానాయకుడు, చెక్ సినిమాలు చేసినా ఆమె కెరియర్ కు హెల్ప్ అవలేదు ఇక చివరగా నాగార్జునతో మన్మథుడు 2 సినిమాలో నటించింది రకుల్ అది కూడా డిజాస్టర్ అవడంతో కెరియర్ లో మరింత వెనక్కి వెళ్లింది.

కొద్దిపాటి గ్యాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ తో కొండపొలం సినిమా చేసిన రకుల్ ఆ సినిమాతో కూడా నిరాశపరచింది. ఇలా చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవడంతో టాలీవుడ్ వదిలి బాలీవుడ్ చేరుకుంది రకుల్. అక్కడ అమ్మడికి వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఎలాగైనా బాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని చూస్తున్న రకుల్ అక్కడ గ్లామర్ షోలో కూడా వెనక్కి తగ్గట్లేదు.

సినిమాలే కాదు అక్కడ పబ్లిక్ ఈవెంట్ లో కూడా రకుల్ తన స్కిన్ షోతో ఎట్రాక్ట్ చేస్తుంది. లేటెస్ట్ గా రకుల్ తన అందాలతో ఆడియన్స్ ని అలరిస్తుంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన రకుల్ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి.

స్లీవ్ లెస్ టాప్.. ఫ్లోర్ లెంగ్త్ మిడ్డీతో.. రకుల్ తన మోడ్రెన్ లుక్ తో అదరగొడుతుంది. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఆమె అందం ఉంది. రకుల్ ఈ ఫోటోలని చూసి తళుకుమన్నది కులుకుల తార.. పలుకుతున్నది వలపు సితార అని వెన్నెలకంటి రాసిన మధుర గీతాన్ని పాడకుండా ఉండలేరు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.