Begin typing your search above and press return to search.

యంగ్ భామలు.. తేజ్.. ఏం చెప్పారంటే..

By:  Tupaki Desk   |   23 Aug 2016 5:01 AM GMT
యంగ్ భామలు.. తేజ్.. ఏం చెప్పారంటే..
X
మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టిన రోజు వేడుకల్లో మెగాభిమానులను కుర్ర హీరోలు.. హీరోయిన్లు అలరించేశారు. చిరంజీవి రాకపోయినా.. ఇంతమంది మెగా హీరోలు.. మెగా సినిమాల్లోని హీరోయిన్లు ఒకేచోట కనిపించడం ఆకట్టుకుంది.

'హ్యపీ బర్త్ డే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి'అంటూ స్పీచ్ స్టార్ట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. 'లాస్ట్ ఇయర్ చాలా పెద్ద ఫంక్షన్ జరిగినా.. రాలేకపోయాను. ఈసారి మాత్రం వదులుకోకూడదని అనుకున్నాను. ఇదో పండగ.. దీనిలో నేను భాగం అయినందుకు వెరీ హ్యాపీ. బాస్ ఈజ్ బ్యాక్.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్' అని చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్.

'మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. హీ ఈజ్ లెజెండ్.. హీ ఈజ్ మెగాస్టార్.. నేను కూడా చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. మీ ప్రేమ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత ప్రేమను పంచుతున్నందుకు థ్యాంక్స్. ఇంత రెస్పెక్ట్.. ఇలాంటి లవ్ నేనెప్పుడూ చూడలేదు' అంటూ రాశి ఖన్నా వచ్చీ రాని తెలుగులోనే కష్టపడి చెప్పేసింది.

ఇక ఊపుమీదున్న సాయిధరం తేజ్ కాస్త ఆలస్యంగా ఫంక్షన్ కు వచ్చాడు. 'పెద్దలకు.. మెగాభిమానులకు మీడియాకు నా హృదయపూర్వక నమస్కారాలు. లేట్ గా వచ్చింనందుకు సారీ.. షూటింగ్ ఎక్కడో జరుగుతోంది. అందుకే స్పీడ్ గా వచ్చేశాను. ప్రతీ ఏడాది ఈ రోజు కోసం వెయిట్ చేస్తాను.. మాకు ఇది కేవలం బర్త్ డే కాదు.. ఇది మెగా పండుగ. మీ అందరితో చేసుకునేందుకు ప్రతీ ఏడాది వెయిట్ చేస్తుంటాను. మీ అందరి సమక్షంలో మేమందరం పండగ చేస్కోవడం హ్యాపీగా ఉంటుంది. ఇందాకే ఖైదీ నెంబర్ 150 ఫస్ట్ లుక్ చూశాను. చిరంజీవి గారి ఫస్ట్ లుక్ అదిరిపోయింది.. నిజంగా 9 ఏళ్లు గ్యాప్ వచ్చిందా అనిపించింది' అంటూ ఫ్యాన్స్ కి ఉత్సాహం తీసుకొచ్చాడు తేజు.

అయితే.. డ్యాన్స్ డైలాగ్ అంటూ అరుపులు ఎక్కువైపోవడంతో.. 'రామ్మోహన్ రావు.. సంవత్సరం తిరిగేలోపు.. 50 లక్షలు సంపాదించి మీ అమ్మాయికి మొగుణ్ణవుతా.. నీకు రంకు మొగుణ్ణవుతా.. ఛాలెంజ్' అంటూ ఛాలెంజ్ మూవీలో చిరు డైలాగ్ చెప్పి ఫ్యాన్స్ తో కేకలు పెట్టించేశాడు సాయిధరం తేజ్.