Begin typing your search above and press return to search.
కరోనా టైంలో షూటింగ్ అనుభవాన్ని వెల్లడించిన రకుల్
By: Tupaki Desk | 25 March 2020 4:30 PM GMTకరోనా భయాలతో సినీ పరిశ్రమ లాక్ డౌన్ ప్రకటిస్తే అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఎంచక్కా షూటింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో జరిగిన ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొనడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. యాడ్ షూటింగ్ చేసినట్టు రకుల్ కూడా స్వయంగా అంగీకరించింది. ఇంట్లోనే ఉండాలని సినీ ప్రముఖులు ఓ పక్క సలహాలిస్తుంటే - ఈ బ్యూటీ షూటింగ్ లో పాల్గొనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా నేపథ్యంలో షూటింగ్ చేసిన భయానక పరిస్థితుల గురించి చెప్పుకొచ్చిందంట. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటి నుండి బయటకు వెళ్తుంటే నాకు ఒక యుద్దానికి వెళ్తున్నట్టుగా అనిపించింది. నా లైఫ్ లో కష్టమైన షూటింగ్ గా చెప్పుకోవచ్చు. పెద్దగా తిరిగే పనిలేకుండా ఒక్కచోటనే షూట్ ఉండటం వల్ల షూటింగ్ కు ప్లాన్ చేశాం. అందుకు తగిన రక్షణ చర్యలు తీసుకొన్నాం. మా యూనిట్ తో పాటు ఒక డాక్టర్ ఎప్పుడూ మాతో ఉన్నాడని - యూనిట్ అందరికి సరైన భద్రత కల్పించారు అని రకుల్ చెప్పారంట.