Begin typing your search above and press return to search.
నేను ఎప్పుడూ పొగ త్రాగలేదు : రకుల్ ప్రీత్ సింగ్
By: Tupaki Desk | 18 Sep 2020 4:00 PM GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మీడియాలో తనపై వస్తున్న కథనాలు నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ని కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ పేరు కూడా ఉందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ వార్తలను మీడియాలో ప్రసారం చేయకుండా సమాచార శాఖకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ లో రకుల్ తెరపై సన్నివేశాలలో మినహా వ్యక్తిగత జీవితంలో తాను ఎప్పుడూ పొగ త్రాగలేదని.. ప్రతీరోజు యోగా చేస్తూ ఫిట్ నెస్ ను ఫాలో అవుతానని.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తానని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కాగా, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి రియా చక్రవర్తి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ - సారా అలీఖాన్ పేర్లు వెల్లడించినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో మీడియాలో తనపై వస్తున్న కథనాలు నిలిపివేయాలని కోరుతూ రకుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రకుల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం.. మీడియాలో ప్రసారాలపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్పందించిందని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా మీడియా సంస్థలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచిస్తూ.. పిటిషన్ ను ఫిర్యాదుగా పరిగణించి ఆయా శాఖలు చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది.