Begin typing your search above and press return to search.

రకుల్‌ మరో యాపారం

By:  Tupaki Desk   |   17 April 2020 1:51 PM IST
రకుల్‌ మరో యాపారం
X
టాలీవుడ్‌ లో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడ్డ ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరితో కూడా ఈ అమ్మడు నటించింది. కాని ఈమె అతి తక్కువ సమయంలోనే తన స్టార్‌ డంను కోల్పోయింది. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు దక్కడమే గగనం అయ్యింది. దాదాపు ఏడాది కాలం తర్వాత తెలుగులో ఇటీవలే ఈమెకు ఛాన్స్‌ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అది కూడా ఇంకా కన్ ఫర్మ్‌ కాలేదు. ఈ సమయంలోనే ఈమె వ్యాపారాలపై ఫోకస్‌ పెడుతున్నట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్‌ లో ఇప్పటికే ఎఫ్‌45 జిమ్‌ సెంటర్లు మూడు ఉన్నాయి. వాటిని ఇంకా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో రెస్టారెంట్‌ బిజినెస్‌ లోకి కూడా ఈమె అడుగు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. రెండేళ్ల క్రితం ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్వరలో రెస్టారెంట్‌ బిజినెస్‌ లో తాను ఎంటర్‌ కాబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. కాని ఆ తర్వాత ఆ విషయమై ఆమె ఎలాంటి ప్రకటన చేయడం కాని.. ఆ దిశగా అడుగులు వేయడం కాని చేయలేదు.

మళ్లీ ఇన్నాళ్లకు ఈ అమ్మడు రెస్టారెంట్‌ బిజినెస్‌ విషయంలో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. సన్నిహితులతో కలిసి రకుల్‌ ఈ వ్యాపారంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హీరోయిన్‌ గా ఆఫర్లు లేని కారణంగా వ్యాపారంలో బిజీ అయ్యేందుకు రకుల్‌ రెస్టారెంట్‌ కు రెడీ అవుతోంది. దేశంలోని ముఖ్యమైన నగరాల్లో ఈమె రెస్టారెంట్స్‌ ను ఏర్పాట్లు ఏర్పాటు చేయబోతున్నారట.