Begin typing your search above and press return to search.

నిన్నే పుట్టిన బుజ్జి పాపాయిని గుర్తుపట్టారా?

By:  Tupaki Desk   |   11 Oct 2016 7:00 AM GMT
నిన్నే పుట్టిన బుజ్జి పాపాయిని గుర్తుపట్టారా?
X
ఈ ఫోటోలో కనిపిస్తున్న బుజ్జమ్మను గుర్తుపట్టారా? పారాడే వయసు నుంచి పసిపిల్లగా ఉన్నపుడే లిప్ స్టిక్ పూసేసి నవ్వుతున్న ఈ బుడత.. ఇప్పుడో పెద్ద హీరోయిన్. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లో లేటెస్ట్ స్టార్ హీరోయిన్ అందుకున్న బ్యూటీ. ఓకే.. ఇప్పుడు అర్ధమైపోయిందన్న మాట. కరెక్టే.. ఈ ఫోటో రకుల్ ప్రీత్ సింగ్ దే.

అక్టోబర్ 10న రకుల్ ప్రీత్ సింగ్ హ్యాపీ బర్త్ డే చేసేసుకుంది. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన గిఫ్ట్ ఈ పిక్చర్. 'ఈ లవ్లీ కొలాగ్ ని.. దానితో పాటు అద్భుతమైన మెసేజ్ ను ఇచ్చిన మామ్ డాడ్ లకు థాంక్యూ. లవ్ యూ బోత్' అంటూ తన సంతోషాన్ని చెప్పింది రకుల్. పనిలో పని అమ్మానాన్నలు ఇచ్చిన మెసేజ్ ను తన భాషలో మార్చేసి.. ఫ్యాన్స్ కి దసరా విషెస్ కూడా చెప్పేసింది. 'నీలో ఉన్న చెడును చంపెయ్. మంచిగా మృదువుగా ఉండు. జీవితం దేవుడు ఇచ్చినదనే విషయం గుర్తుంచుకో. అందరికీ హ్యాపీ దసరా' అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.

ప్రస్తుతం రామ్ చరణ్ తో ధృవ.. మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో మూవీ.. సాయిధరం తేజ్-గోపిచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం.. బోయపాటి - బెల్లంకొండ శ్రీను చిత్రాలతో పాటు.. తమిళ్ లో విశాల్ సరసన తుప్పరివాలన్ లలో నటిస్తోంది. షిమ్లా మిర్చి అనే బాలీవుడ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్టుల లిస్ట్ చూశాక.. రకుల్ ని స్టార్ హీరోయిన్ అనడంలో ఏమైనా డౌట్స్ ఉంటాయా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/