Begin typing your search above and press return to search.
ఎలా సెట్ అవుతుందమ్మా రకుల్
By: Tupaki Desk | 16 Feb 2018 5:52 PM GMTఎంత పెద్ద హీరోయిన్ అయినా, ఎన్ని సినిమాలు చేసిన తన డ్రీమ్ రొల్ చేసే అవకాశం మాత్రం చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే దొరుకుతుంది. దొరకని వాళ్ళు మాకు అలాంటి రోల్ చేయాలని ఉంది అంటూ డైరెక్టర్ లకు హింట్ లు ఇస్తూ ఉంటారు లేదా ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా రకుల్ కు ఇష్టమైన పాత్ర ఎంటో తెలుసా?
కెరీర్ మొదట్లో ఎత్తు పల్లాలను చూసినా - నెంబర్ వన్ రేంజ్ కి ఎదిగిన ఢిల్లీ పిల్ల రకుల్ ప్రీత్ సింగ్. ఈమె ఇపుడు బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈమధ్యనే అయ్యారి అనే దేశ భక్తి సినిమా చేసింది. అది ఇవాళే అనగా ఫిబ్రవరి16 న రిలీజ్ అయ్యి మంచి టాక్ సంపాదిస్తోంది. తనను ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది అని ఒక ఇంటర్వ్యూ లో అడగగా "నాకు అనుష్క - నయనతార సినిమాలు చాలా ఇష్టం. వారి స్క్రిప్ట్ సెలక్షన్ బావుంటుంది. అలాంటి పాత్రలు చేయాలని ఉంది" అంటూ సెలవిచ్చింది. నయనతార - అనుష్క సౌత్ లొనే టాప్ హీరోయిన్లు. అలాంటి సినిమాలు చేయడం అందరికి సాధ్యం కాదు. చేద్దామన్న రావు కూడా.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి హిట్ కొట్టాలంటే బాగా స్టార్ డమ్ ఉండాలి కనీసం ఇండస్ట్రీ లో పదేళ్ల అనుభవం ఉండాలి. కానీ రకుల్ మొన్నీమధ్యనే స్టార్ అయిన హీరోయిన్. ఈమె కు ఇలాంటి సినిమాలు రావాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది మరి. కాని ఇప్పుడే కావాలి అంటుంటే ఎలా సెట్ అవుతుందమ్మా రకుల్.