Begin typing your search above and press return to search.

ఈసారి గ్లామరసం కాదు ఫిట్ రసమే

By:  Tupaki Desk   |   12 Sept 2016 5:00 PM IST
ఈసారి గ్లామరసం కాదు ఫిట్ రసమే
X
ఈ మధ్య కాలంలో తెలుగు తెరమీద తన గ్లామరసంతో ఆకట్టుకున్న హాట్ లేడీ ఎవరూ అంటే టపీమని రకుల్ ప్రీత్ సింగ్ పేరునే 10లో 9 మంది చెబుతున్నారు. ఆ రేంజులో తన హాట్ లుక్కుతో ఈ పిల్ల ఆకట్టుకుంటోంది. అందుకే ఇప్పుడు రామ్ చరణ్‌ - మహేష్‌ బాబు - సాయిధరమ్ తేజ్ సినిమాలతో వరుసగా బిజీగా ఉంది. అయితే అస్తమానం గ్లామరసం చూపిస్తే ఏం బాగుంటుంది? అందుకే ఇప్పుడు ఫిట్నెస్ రసం కూడా చూపిస్తానంటోంది అమ్మడు.

నిజానికి రకుల్ చాలా పెద్ద ఫిట్ నెస్ ఫ్రీక్. ఏ రేంజు ఫ్రీక్ అంటే అమ్మడు ఏకంగా తన కోసం ఒక సొంత జిమ్ నే కొనుక్కుంది. అఫ్‌ కోర్స్ అక్కడ ఇతరులకు కూడా ట్రైనింగ్ ఇస్తారులే. అయితే సాయిధరమ్ తేజ్ తో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో ఒక అథ్లీట్ గా కనిపించనుందట ఈ అమ్మడు. ఇప్పటికే సాయిదరమ్ ఫ్యాషన్ మ్యాగజైన ఎడిటర్ రోల్ చేస్తున్నాడు అనే న్యూస్ రాగా.. ఇప్పుడు ఈ రకుల్ రోల్ గురించి ఇలా తెలుస్తోంది. ఏదో అల్లాటప్పాగా బ్యాటు పట్టేసుకుని ఏ టెన్నీస్ స్టారో షెటిల్ స్టారో అనకుండా.. తన ఫిట్ లుక్కుతో అమ్మడు రియల్ స్పోర్ట్స్ పర్సన్ తరహాలో కనువిందు చేస్తున్నా అంటోంది మన కూల్ లేడీ.

అంతా బాగానే ఉంది కాని.. అసలు గోపిచంద్ మలినేని తీసే రొటీన్ మసాలా మూవీస్ లో.. అసలు ఈ పాత్రల తాలూకు ప్రొఫెషన్లు ఎంతవరకు కీలకపాత్రను పోషిస్తాయి అనే విషయమే మనం చూడాలి. ఇలా ప్రొఫెషన్ చుట్టూ కథను తిప్పే అలవాటు మన దర్శకులకు పెద్దగా లేదు. చేసేది ఏ పాత్రైనా కూడా చివరకు ఒక విలన్ తో క్లాష్‌.. అండ్ ఫైటింగ్.. అండ్ పంచ్ డైలాగ్స్.. ఇదే ప్యాట్రన్ ఫాలో అవుతుంటారు. చూద్దాం రకుల్ ఏం చేస్తుందో!!