Begin typing your search above and press return to search.

రకుల్ ని గుర్తు పట్టలేమంటగా!!

By:  Tupaki Desk   |   7 April 2016 11:00 PM IST
రకుల్ ని గుర్తు పట్టలేమంటగా!!
X
వరుసగా భారీ సినమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఇఫ్పుడు అల్లు అర్జున్ సరసన కూడా నటించేసింది. బోయపాటి శ్రీను-బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కిన సరైనోడులో రకుల ప్రీత్ మెయిన్ హీరోయిన్. ఈ మూవీలో మరో హీరోయిన్ గా నటిస్తున్న కేథరిన్ థ్రెసా పాత్రకు కూడా ప్రాధాన్యం ఉన్నా.. బన్నీకి జోడిగా నటిస్తున్నది మాత్రం రకులే. ఆ ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టెయినర్ లో రకుల్ దాదాపు డీగ్లామర్ రోల్ చేస్తోందట.

అంటే అసలు మేకప్ వాడకుండానే సినిమా అంతా నటించేందుకు ట్రై చేసిందట ఈ భామ. పక్కింటమ్మాయిలా కనిపించాలంటే ఇలాంటి ప్రయోగాలు అవసరం అన్నది ఆమె ఉద్దేశ్యం. అయితే తన లుక్ ఫ్యాన్స్ కి థ్రిల్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది రకుల్ ప్రీత్. ఇంకా చెప్పాలంటే మొదటిసారి చూసినపుడు అసలు తనను గుర్తు పట్టలేరు కూడా అంటూ సవాల్ చేసేసింది. అయితే.. అమ్మడి గ్లామర్ ను కూడా బోయపాటి బాగానే వాడుకున్నాడు. అయితే, ఈ అందాల ఆరబోత కేవలం పాటలకే పరిమితం అన్నమాట. సాంగ్స్ వరకూ మాత్రం అల్ట్రామోడర్న్ గాళ్ మాదిరిగా కనిపించనుంది ఈ ఢిల్లీ బ్యూటీ.

ఇప్పటికే షూటింగ్ పూర్తయిపోయి.. ఆడియో కూడా రిలీజ్ అయింది. ఏప్రిల్ 22న విడుదల కానున్న ఈ మూవీపై అభిమానుల నుంచి ఇండస్ట్రీవరకూ చాలానే అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 10న ఆడియో సక్సెస్ ప్రోగ్రాంను వైజాగ్ ల గ్రాండ్ రేంజ్ లో సెలబ్రేట్ చేయనున్నాడు నిర్మాత అల్లు అరవింద్.