Begin typing your search above and press return to search.

రకుల్ ఇలా అయిపోయిందేమిటి?

By:  Tupaki Desk   |   15 Feb 2019 12:57 PM IST
రకుల్ ఇలా అయిపోయిందేమిటి?
X
నిన్న విడుదలైన కార్తీ దేవ్ యునానిమస్ గా డిజాస్టర్ టాక్ తో రన్ అవుతోంది. యావరేజ్ గా అనిపించినా ఎంతో కొంత నిర్మాతలను సేఫ్ చేసే టాలెంట్ ఉన్న కార్తీ దీని విషయంలో మాత్రం పూర్తి హెల్ప్ లెస్ గా మిగిలిపోయాడు. కథ కథనం సంగీతం ఏ ఒక్కటీ కనీస స్థాయిలో లేకపోవడంతో కెరీర్ లో వరస్ట్ మూవీ ఇదేనని తమిళ్ ఫ్యాన్స్ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు.అయితే లుక్స్ లో కార్తీ మంచి స్టైలిష్ గా కనిపించడం ఒక్కటే అభిమానులకు ఊరట.

విచిత్రంగా గ్లామరస్ గా ఉండాల్సిన రకుల్ ప్రీత్ సింగ్ మునుపెన్నడూ లేనంత డల్ గా కనపడి నిరాశ కలిగించింది. దానికి మేకప్పు ఒక కారణమని చెప్పాలి. క్లోజప్ షాట్స్ లో అసలు చూడలేనంత ఎబ్బెట్టుగా కనిపించడం ఫ్యాన్స్ దృష్టి దాటి పోలేదు. కారణాలు ఏమైనా దీని మీద బోలెడు ఆశలు పెట్టుకున్న రకుల్ కు దెబ్బ పడినట్టే. కార్తీతో ఇంతకు ముందే ఖాకీలో చేసినా అది ఫస్ట్ హాఫ్ కే ఎక్కువగా పరిమితమైన పాత్ర.

దేవ్ లో ఫుల్ స్పాన్ కాబట్టి హిట్ కొడితే ఇక్కడా అవకాశాలు వస్తాయని తన ప్లాన్. సూర్యతో ఎన్జికె చేస్తున్నప్పటికీ అందులో సాయి పల్లవి కూడా ఉంది కాబట్టి ఎక్కువ ఆశించడానికి లేదు. అందుకే దేవ్ మీదే భారం వేసింది. అయితే అవసరానికి మించిన నాజూకుతనంతో రకుల్ బాడీ సరైన ఫిజిక్ లో లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానికి తోడు ఇలా నెగటివ్ లుక్స్ తో నిరాశ పరిస్తే తెలుగులో ఇంకొన్ని ఆఫర్లు ఎలా వస్తాయి. రకుల్ చైతు సరసన వెంకీ మామలో చేయబోతున్న సంగతి తెలిసిందే.