Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: కూరగాయల షాపు రకుల్!!
By: Tupaki Desk | 6 Feb 2016 10:55 AM GMTచెప్పినట్టే చేసింది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఒక కూరగాయల మార్కెట్ లో ఒక షాపులో కూర్చొని కూరగాయలు అమ్మేసింది హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. డిజైనర్ బట్టల్లో మెరిసిన ఈ సుందరి.. మెడ చుట్టూ ఎర్రటి కండువా వేసుకొని.. ఒక సామాన్య కార్మికురాలిగా రైతుగా షాపులో కాసేపు కూరగాయలు అమ్మింది. ఇంతకీ ఎందుకోసం ఇదంతా?
లక్ష్మీ మంచు కొత్తగా ''మేము సైతం'' అనే టివి షో ఒకటి మొదలెడుతోంది. ఈ షో కోసం ప్రతీసారీ ఒక గెస్టును పిలిచి వారితో సొసైటీలోని వివిధ చిన్న చిన్న చిరు వ్యాపారుల అవతారం ఎత్తిస్తారు. తద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి.. వారిలో స్ఫూర్తిని నింపాలనేది ప్లాన్. అందులో భాగంగా తొలి ఎపిసోడ్ ను రకుల్ పై చిత్రీకరించింది లక్ష్మి మంచు. ఈ ఎపిసోడ్ ను కె.పి.హెచ్.బి మార్కెట్ లో ఈరోజు తెలియజేశారు.
ఇక షూటింగ్ స్పాటుకు వస్తున్నా అంటూ రకుల్ ట్విట్టర్ లో పేర్కొంటే మరి హార్డుకోర్ అభిమానులు ఆమె దర్శనం కోసం వెళ్లకుండా ఉంటారా? అలా వెళ్ళిన ఒక ఔత్సాహికులు ఒక ఫోటో తీసి ఇలా షేర్ చేశాడు. అది సంగతి.