Begin typing your search above and press return to search.

రకుల్.. నీ పెద్ద మనసుకు హ్యాట్సాఫ్

By:  Tupaki Desk   |   24 Nov 2015 11:30 AM GMT


ఒక స్టార్ హీరోయిన్ ఇంకో స్టార్ హీరోయిన్ని పొగడ్డం... వేరే వాళ్ల సినిమాల్ని ప్రమోట్ చేయడం.. చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇలా చేస్తే తమ గౌరవం తగ్గిపోతుందని అనుకుంటుంటారు చాలామంది హీరోయిన్లు. ఐతే ఈ తరం హీరోయిన్లకు మరీ అంత ఇగో ఏమీ లేదు. స్టార్ స్టేటస్ వచ్చినా డౌన్ టు ఎర్త్ ఉంటున్నారు. తోటి స్టార్ హీరోయిన్ల మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. వేరే ఫంక్షన్లకు వచ్చి విష్ చేస్తున్నారు. వేరే సినిమాల్ని ప్రమోట్ చేయడానికి కూడా ముందుకొస్తున్నారు. ఈ విషయంలో మిగతా వాళ్లకంటే రకుల్ ప్రీత్ సింగ్ పేరు ముందు చెప్పాలి.

ఇప్పటికే స్టార్ స్టేటస్ అందుకుని పెద్ద పెద్ద హీరోల సరసన నటిస్తున్న రకుల్ ఏమాత్రం భేషజం చూపించకుండా బోళాగా మాట్లాడేయడం.. తోటి స్టార్ హీరోయిన్లను పొగడ్డం తరచుగా చూస్తుంటాం. తెలుగులో విడుదలయ్యే ప్రతి పెద్ద సినిమాకు సంబంధించి ముందు రోజు ఆ యూనిట్ సభ్యులకు ఆల్ ద బెస్ట్ చెబుతుంటుంది రకుల్. తాజాగా ‘సైజ్ జీరో’ టీంకి తనదైన శైలిలో విష్ చెప్పింది. సినిమాలో అనుష్క చెప్పిన కొన్ని డైలాగులతో డబ్ స్మాష్ వీడియో చేసి.. దాన్ని ట్విట్టర్లో పెట్టి ఆ సినిమాకు విషెస్ చెప్పింది రకుల్. తన తోటి స్టార్ హీరోయిన్ సినిమాను ఇలా ప్రమోట్ చేయాలంటే చాలా పెద్ద మనసే ఉండాలి. ఈ విషయంలో ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.