Begin typing your search above and press return to search.

ఫోటో టాక్: బ‌జార్ లో కార్పొరెట్ గాళ్

By:  Tupaki Desk   |   19 Dec 2019 1:54 PM GMT
ఫోటో టాక్: బ‌జార్ లో కార్పొరెట్ గాళ్
X
ఆ సూటు బూటు.. స్టైలింగ్ చూశాక‌.. అబ్బో కార్పొరెట్ గాళ్.. ఖ‌రీదైన సెక్ర‌ట్రీ అని కుర్రాళ్లంతా చూపులు తిప్పుకోవ‌డం లేదు క‌దా! కార్పొరెట్ కంపెనీల్లో ప‌ని చేసే అమ్మాయిల్లోని రెక్లెస్ యాటిట్యూడ్ క‌నిపిస్తోంది అందాల ర‌కుల్ ప్రీత్ లో. ఇంత‌కుముందు స్పైడ‌ర్ మ్యాన్ చిత్రంలో కార్పొరెట్ లుక్ తో త‌ళత‌ళ‌లాడింది. ఇటీవ‌లే మ‌న్మ‌ధుడు చిత్రంలో అల్ట్రా మోడ్ర‌న్ పోష్ గాళ్ గా క‌నిపించి వెర్రెత్తించింది.

అప్పుడ‌ప్పుడు లంగా వోణీలో సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించినా ర‌కుల్ లోని కార్పొరెట్ గురూ అన్నిటినీ డామినేట్ చేసేస్తూ ఉంద‌నే చెప్పాలి. స్వ‌త‌హ‌గానే బిజినెస్ ఉమెన్ కాబ‌ట్టి.. ఎంటర్ ప్రెన్యూర్ క్వాలిటీస్ కోసం త‌హ‌త‌హ క‌నిపిస్తుంటుంది. ఇంత‌కీ ఈ కార్పొరెట్ లుక్ ఎవ‌రి కోసం? అంటే ప్ర‌ఖ్యాత బ‌జార్ ఇండియా మ్యాగ‌జైన్ కోసం.

బ‌జార్ లో ప‌డి మ‌రీ అంత రెక్ల‌స్ గా ఆ చెయ్యి అలా విస‌రాలా? ఆ హ్యాండ్ బ్యాగ్ గాల్లో ఫ్లైట్ లా ఎగిరింది అంటారా? అదంతే. వైట్ అండ్ వైట్ ఫ్రాకు.. పైన బిస్క‌ట్ క‌ల‌ర్ లాంగ్ కోట్.. చేతిలో కాంబినేష‌న్ హ్యాండ్ బ్యాగ్.. అలా వెళుతున్న తీరు చూస్తుంటే ఎంత కేర్ లెస్ గా ఉందో అనిపించ‌డం లేదూ? అయినా కేర్ చేస్తే కార్పొరెట్ గాళ్ ఎందుకు అనిపించుకుంటుంది? ఈ మేక‌ప్ కోసం ఏకంగా అర‌డ‌జ‌ను మంది శ్ర‌మించార‌ట‌. ఆ మేర‌కు ఇన్ స్టాగ్ర‌మ్ లో వివ‌రాలు అందించింది. మాధ‌వ్ హెయిర్ స్టైల్.. ఐఎం సాల్ మేక‌ప్.. మేఘ‌న పీఆర్ ..వీళ్ల‌తో పాటు ముగ్గురు అసిస్టెంట్లు ఫోటోగ్రాఫ‌ర్లు అదే ప‌నిగా శ్ర‌మించార‌ట‌.