Begin typing your search above and press return to search.

ర‌కుల్ లాగి పెట్టి ఒక్క‌టిచ్చింద‌ట‌

By:  Tupaki Desk   |   7 Aug 2017 5:17 AM GMT
ర‌కుల్ లాగి పెట్టి ఒక్క‌టిచ్చింద‌ట‌
X
ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని టాలీవుడ్ ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. టాప్ హీరోయిన్లుగా ఉండే వారి నోటి నుంచి గ‌తానికి సంబంధించిన విష‌యాలు అంతగా బ‌య‌ట‌కు రావు. కానీ.. ర‌కుల్ తీరు వేరు. ఓపెన్ గా చెప్పేస్తుంది. సెకండ్ హీరోయిన్ గా చేయ‌టానికి సైతం ఓకే అన్న రోజుల్ని సైతం వివ‌రంగా చెబుతుంది.

తాజాగా ఒక మీడియా సంస్థ‌కు చెందిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ర‌కుల్ పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర అంశాల్ని చెప్పుకొచ్చింది. రీల్ లైఫ్ లో స‌రే.. రియ‌ల్ లైఫ్ లో ఎవ‌రినైనా చెప్పుతో కొట్టారా? అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పుకొచ్చింది. ఒక‌సారి కాదు.. రెండుసార్లు చెప్పుతో కొట్టిన విష‌యాన్ని చెప్పింది. కాలేజీ రోజుల్లో ఒక‌సారి చెప్పుతో కొట్టాన‌ని.. రెండోసారి ఫోరం మాల్ లో కొట్టిన‌ట్లుగా చెప్పింది.

బ్ర‌ద‌ర్ తోనూ.. ఒక స్నేహితుడితోనూ ఫోరం మాల్‌ కు సినిమాకు వెళ్లాన‌ని.. ఏదో తీసుకొని వెన‌క్కి తిరిగే స‌మ‌యానికి ఒక వ్య‌క్తి ముఖానికి ద‌గ్గ‌ర‌గా రావ‌టంతో ఒళ్లు మండిపోయిన‌ట్లు చెప్పింది.

సెల్ఫీ తీసుకోవ‌టానికి వ‌చ్చిన‌ట్లు చెప్పిన అత‌డ్ని.. కాస్త గ‌ట్టిగానే తాను కొట్టిన‌ట్లు చెప్పింది. ఏం చేస్తున్నావ్ అంటే.. ఎప్ప‌టి నుంచో మిమ్మ‌ల్ని ఫాలో అవుతున్నా అని అన‌టంతో మ‌రింత మండిపోయింది. ఫాలో చేయ‌టం ఏమిటి? అంటూ గ‌ట్టిగా నిల‌దీసి.. గార్డ్స్ ను పిలిచి అత‌న్ని బ‌య‌ట‌కు పంపాల‌ని గ‌ట్టిగా చెప్పా.

త‌న‌కు కోపం రాద‌ని.. కానీ ఒక‌సారి వ‌స్తే మాత్రం అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ధ‌లైన‌ట్లేన‌ని చెప్పుకొచ్చింది. అయితే.. కోపం వెంట‌నే త‌గ్గిపోతుంద‌ని చెప్పిన ర‌కుల్‌.. అప్ప‌టి నుంచి తాను సెల్ఫీలు ఇవ్వ‌టం లేదంది. మ‌రికొన్ని ప్ర‌శ్న‌ల‌కు బ‌దులిస్తూ.. హీరోల‌కు లేని క‌ష్టాలు హీరోయిన్ల‌కు ఎక్కువ‌ని చెబుతూ.. గ్లామ‌ర్ గా క‌నిపించ‌టానికి హీరోయిన్లు చాలా క‌ష్ట‌ప‌డాలంది.

హీరోల‌తో పోలిస్తే.. హీరోయిన్ల‌కు ఆ క‌ష్టాలు ఎక్కువ‌ని.. హైబ్రోస్ ద‌గ్గ‌ర నుంచి అన్ని జాగ్ర‌త్త‌గా తీసుకోవాలంది. సంపాదించిన సంపాద‌న‌లో దాదాపు 50 శాతం మొయింటైనెన్స్ కే స‌రిపోతుంద‌ని పేర్కొంది. కావాలంటే త‌న బిల్లుల్ని చూపిస్తాన‌ని చెప్పిన ర‌కుల్‌.. హీరోయిన్స్ కు గ్లామ‌ర‌స్ గా క‌నిపించ‌టానికి చాలానే క‌ష్టాల‌ని చెప్పుకొచ్చింది. తాను రెమ్యున‌రేష‌న్ పెంచిన విష‌యం అబ‌ద్ధ‌మ‌ని.. అన్యాయంగా ప్ర‌చారం చేస్తున్నార‌ని చెప్పింది. హీరో.. హీరోయిన్స్ పారితోషికం మ‌ధ్య గ్యాప్ చాలానే ఉంద‌ని చెప్పుకొచ్చింది.