Begin typing your search above and press return to search.
తాప్సీ సెటైర్ కి రకుల్ సపోర్ట్
By: Tupaki Desk | 9 Jan 2018 12:07 PM GMTఇప్పుడే కాదు.. గతం- భవిష్యత్.. ఎప్పుడైనా సరే సలహాలు ఇవ్వడం మాత్రం మహా ఈజీ. వీటిని స్వీకరించేందుకు అవతలి వాళ్లు సిద్ధంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా.. తమ దిక్కుమాలిన మేథో సంపత్తి అంతా బయటపెడుతుంటారు కొందరు. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి పనికిరాని సలహాలు ఇచ్చేవాళ్లు కోకొల్లలుగా తయారయ్యారు.
రీసెంట్ గా ఒక ఫాలోయర్.. తాప్సీ పన్నుకు ఓ సూపర్ సజెషన్ పడేశాడు. అదేంటంటే.. ఇకపై తాప్సీ జుడ్వా2 లాంటి సినిమాలు మాత్రమే చేయాలని.. అప్పుడే ఆమెను అందరూ గుర్తుంచుకుంటారని.. పింక్ - నామ్ షబానా లాంటి విసిగించే సినిమాలు చేస్తే ఎవరికి గుర్తుండకుండా పోతుందని చెప్పుకొచ్చాడు ఆ మహానుభావుడు. ఇలాంటి కామెడీలు సోషల్ మీడియాలో కావలసినన్ని కనిపిస్తాయి కానీ.. ఢిల్లీ బ్యూటీ రియాక్ట్ అవడంతోనే ఈ సలహా గురించి జనాలకు తెలిసింది. ఇంతకీ తాప్సీ ఏమని రిప్లై ఇచ్చిందా అనుకుంటున్నారా? 'ఓకే సార్.. ఇకపై సినిమాలు ఒప్పుకునే ముందు.. మిమ్నల్ని సంప్రదిస్తానులే'అంటూ వెటకారం ఆడింది తాప్సీ. సింపుల్ గా చెప్పాలంటే సెటైర్ వేసింది.
ఇంతవరకే అనుకుంటే.. తాప్సీ రిప్లైకి టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ వత్తాసు పలకడం మరీ ఆకట్టుకుంటోంది. ఇకిలిస్తున్నట్లుగా ఓ నాలుగు స్మైలీలను పోస్ట్ చేసి.. తాప్సీ ఫీలింగ్ ను సపోర్ట్ చేసింది రకుల్. ఇంతకీ పింక్ లాంటి సినిమాలను అన్నందుకు తాప్సీకి కోపం వచ్చింది అనుకుందాం.. మరి రకుల్ ఎందుకు రియాక్ట్ అయిందబ్బా?