Begin typing your search above and press return to search.
వడదెబ్బకు ర'కూల్' టిప్స్ ఇవే
By: Tupaki Desk | 10 April 2015 7:43 AM GMTసూర్యారావ్ ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండ నడినెత్తిన ఫడీల్మని కొడుతోంది. మునుపెన్నడూ లేనంతగా వడగాల్పులు బెంబేలెత్తించే పరిస్థితి. బైటికి వెళ్లాలంటేనే ఒణికే పరిస్థితి. ఇలాంటి వేళ వడదెబ్బ నుంచి సూర్యుని తాపం నుంచి బైటపడి బతికి బట్టకట్టాలంటే ఏం చేయాలి? .. అందాల కథానాయిక రకూల్ ప్రీత్ కొన్ని టిప్స్ చెబుతోంది.
వేకువ ఝామునే నిద్రలేచి ముఖానికి ఐస్‌క్యూబ్స్‌తో మాలిష్ చేయాలి. ఐస్‌తో బాగా రుద్దడం వల్ల ముఖంలో రక్తప్రసరణ పెరుగుతుంది. రోజంతా ఎండలో తిరిగినా డీహైడ్రేషన్‌కి గురవ్వకుండా ఓ అద్భుతమైన టిప్ ఉంది. పుచ్చకాయ, దోసకాయ వంటి వాటిని ముక్కలుగా కోసుకుని రోజంతా తింటూ ఉండాలి. అలాగే పుచ్చకాయ జ్యూస్‌ని నీళ్లలో కలిపి రోజంతా తాగుతూ ఉండాలి. అవసరమైతే ఐస్ క్యూబ్స్ కలుపుకుంటే చల్లదనం పెరుగుతుంది. అనవసరమైన కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఇవన్నీ ఆచరిస్తే ఎక్కడ తిరిగినా ఎలాంటి వడదెబ్బ తగలదు. వెంటనే ఎండలో కుప్పకూలే పరిస్థితి రాదు. సూర్య తాపం నుంచి ఇది సరైన విముక్తి.. అంటోంది అమ్మడు.
ఇలాంటి ఎండల్లో అవసరమైతేనే మేకప్ వేయాలి. మామూలు జనం మేకప్ వదిలేస్తేనే మంచిది. దానివల్ల ఛర్మగ్రంధులు ఓపెన్ అయ్యి వ్యర్థం చెమట రూపంలో బైటికి పోతుంది. దీనివల్ల హాయిగా ఉంటుంది... అంటూ తనకి తెలిసిన టిప్స్‌ని టకటకా చెప్పేసింది ఈ పంజాబి కుడి.