Begin typing your search above and press return to search.
బిర్యానీలు తెచ్చిపెట్టిన రకుల్
By: Tupaki Desk | 1 Jun 2018 6:14 AM GMTహాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటి వరకు టాలీవుడ్ లో ఉరుకులు పరుగులు పెట్టింది. కానీ ఇప్పుడు మాత్రం అమ్మడు పక్క ఇండస్ట్రీలో లోనే తన కెరీర్ ను కొనసాగిస్తోంది. కార్తీ తో కోలీవుడ్ లో ఖాకి సినిమా చేసినప్పటి నుండి అక్కడ ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో కూడా ఈ మధ్య అజయ్ దేవగన్ తో ఒక సినిమాను ఒకే చేసిన సంగతి తెలిసిందే. ఇల్లు హైదరాబాద్ లోనే ఉండడంతో ముంబై నుంచి హైదరాబాద్ కు ఈ మధ్య ప్రయాణాలు ఎక్కువయ్యాయి.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. హైదరాబాద్ లో రకుల్ సెట్ అయ్యిందని ముంబై వారు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే ఆమెను హైదరాబాద్ బిర్యానీ గురించి తెగ అడుగుతున్నారట. ఎప్పుడు తినిపిస్తావ్ అని హీరో అజయ్ దేవగన్ అలాగే ఆ ప్రాజెక్ట్ లో నటిస్తున్న టబు ఇతర నటి నటులు తరచు గుర్తు చేస్తుండడంతో రకుల్ మొత్తానికి ట్రీట్ ఇచ్చిందట. గత కొన్ని రోజులుగా బిర్యానీ పార్టీ ఇవ్వాలని అనుకున్నప్పటికి కుదరలేదు. రీసెంట్ గా రకుల్ తమ్ముడు హైదరాబాద్ నుంచి ముంబై రావడంతో అతని హెల్ప్ ద్వారా చిత్ర యూనిట్ కి బిర్యానీ పార్టీ ఇచ్చిందట.
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అమ్మడు ఎంతో హ్యాపీగా చెప్పింది. అలాగే మటన్ బిర్యానీ కూడా తాను స్పెషల్ గా రెడీ చేసి ఇచ్చినట్లు రకుల్ తెలిపింది. రకుల్ ఇలా పరభాషా నటులతో ఫ్రెండ్లిగా ఉండడం చూస్తుంటే ఇంకా కొన్నేళ్ల వరకు ఆమె స్థానానికి ఏ డోకా ఉండదని చెప్పవచ్చు. మరి ఆమె చేస్తున్న ప్రాజెక్టులు ఎంత వరకు హిట్ అవుతాయో చూడాలి.