Begin typing your search above and press return to search.
ఆ గాసిప్స్ చాలా బాధించాయి: రకుల్
By: Tupaki Desk | 7 Aug 2017 4:33 PM GMTసినీ ప్రపంచంలో రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టడం సహజం. హీరో, హీరోయిన్లు ఆ గాసిప్స్ ను పర్సనల్ గా తీసుకొని బాధపడుతూ కూర్చుంటే ఇండస్ట్రీలో నెగ్గుకురావడం కష్టం. ఇక హీరోయిన్లయితే ఇలాంటి గాసిప్స్ ప్రతిరోజూ వేధిస్తుంటాయి. చాలామంది హీరోయిన్లు ఆ పుకార్లను ఓ చెవితో విని మరో చెవితో వదిలేస్తుంటారు. అయితే, తనపై వచ్చిన ఒక గాసిప్ మాత్రం చాలా బాధపెట్టిందని చెబుతోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మామూలుగా తాను కూడా గాసిప్స్ ను లైట్ తీసుకుంటానని, కానీ ఆ గాసిప్ విని తట్టుకోలేక పోయానని చెప్పింది రకుల్.
కెరీర్ బిగినింగ్ లోనే స్టార్ హీరోలతో వరుస హిట్లు కొడుతూ మంచి జోరుమీదుంది రకుల్. దీంతో, ఆమె కమర్షియల్ గా కూడా కొద్దిగా సెటిల్ అయింది. దీంతో, గత ఏడాది హైదరాబాద్‌లో రూ.3 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొనుక్కుంది. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే, ఆ ఇంటిని తనకు ఒక హీరో గిఫ్ట్‌గా ఇచ్చాడని, అతడితో తనకు ఎఫైర్ ఉందని గాసిప్స్ రావడం తనను చాలా బాధపెట్టినట్లు రకుల్ స్వయంగా తెలిపింది. కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కొనుక్కుంటే ఇలాంటి పుకార్లు రావడం ఆవేదన కలిగించిందని ఆమె చెప్పింది. ఒకవేళ తనకు అంత ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చే బాయ్ ఫ్రెండే ఉంటే, ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముందని రకుల్ ప్రశ్నించింది.
తాను సంపన్న కుటుంబ నేపథ్యం నుంచి రాలేదని, తాను కోట్లల్లో పుట్టి పెరగలేదని రకుల్ చెప్పింది. తన తండ్రి జీతం మీదే తమ కుటుంబం నడిచిందని, అటువంటి సాధారణ కుటుంబత తమదని తెలిపింది. తాను సొంతగా 24 ఏళ్లకే ఇల్లు కొనడం గొప్ప అచీవ్ మెంట్ గా చెప్పడం పోయి, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా గాసిప్స్ రాయడం దారుణమని రకుల్ అభిప్రాయపడింది. తనకు ఎవరైనా రూ.3 కోట్లతో గిఫ్ట్ ఇచ్చే వ్యక్తులు తన జీవితంలో ఉంటే గర్వపడతాను కానీ ఆ గిఫ్ట్ స్వీకరించనని రకుల్ తెలిపింది. సెలబ్రెటీల మనోభావాల్ని కించపరిచేలా వ్యక్తిగతంగా గాసిప్స్ రాయడం తగదని రకుల్ మీడియాకు చెప్పింది.