Begin typing your search above and press return to search.

గోల్డెన్ టెంపుల్ లో ఎక్స్ ప్రెస్ భామ

By:  Tupaki Desk   |   26 March 2016 5:33 AM GMT
గోల్డెన్ టెంపుల్ లో ఎక్స్ ప్రెస్ భామ
X
ఈ మధ్య ఎక్స్ ప్రెస్ అంటూ సినిమాలు వరుసగా వస్తున్నాయ్ కానీ.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తోనే ఇవి మొదలయ్యాయి. ఈ మూవీతోనే తన ఫిలిం జర్నీని స్టార్ట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. తన కెరీర్ ను కూడా ఎక్స్ ప్రెస్ స్పీడ్ తోనే పరిగెట్టిస్తోంది. వరుస హిట్స్ తో పాటు.. అన్నీ భారీ ఆఫర్స్ తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్ పై మమకారం కూడా బాగానే పెంచుకుంది.

రీసెంట్ గా ఎన్టీఆర్ తో నటించన నాన్నకు ప్రేమతో మూవీతో తొలి బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత.. రకుల్ ప్రీత్ సింగ్ రిలీఫ్ గా ఫీలైంది. తన సంతోషాన్ని షికార్లు చేయడం ద్వారా ఎంజాయ్ చేస్తోంది ఈ సుందరి. ఇప్పుడీ సుందరాంగి దేశంలోనే ప్రఖ్యాతి చెందిన పుణ్యక్షేత్రమైన అమృత్ సర్ లో ఉంది. 'తొలిసారి అమృతసర్‌ ను చూస్తున్నా. చాలా రోజులుగా ఈ ప్రాంతాన్ని సందర్శించాలని కోరిక. ఇన్నాళ్లకు నా కోరిక తీరింది' అంటూ ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా చెప్పింది రుకల్.

అమృత్ సర్ లో బోట్ షికార్లు చేస్తున్న ఒక ఫొటోను కూడా అభిమానులతో పంచుకుంది రకుల్ ప్రీత్ సింద్. ఇంత వరకూ అమృతసర్‌ ను చూడలేదని, తొలిసారి వచ్చానని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన రకుల్‌ ప్రీత్ నటించిన సరైనోడు.. తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇందులో అచ్చమైన పల్లెటూరి అందంగా రకుల్ కనిపించనుంది. ఏప్రిల్ 28న సరైనోడు ప్రేక్షకుల ముందుకు రానుంది.