Begin typing your search above and press return to search.

హ్యాపీ రకుల్‌ గుళ్ల సందర్శనం!!

By:  Tupaki Desk   |   28 Feb 2016 7:11 AM GMT
హ్యాపీ రకుల్‌ గుళ్ల సందర్శనం!!
X
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. సమంత అయిపోయినంత ఈజీగా స్టార్‌ హీరోయిన్‌ అవ్వలేదు. ముందు రెండు మూడు సినిమాలు చేసింది. ఒక రెండు సినిమాల్లోంచి ఈమెను తీసేశారు. అప్పుడు వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌ తో ఒక హిట్టు పడింది. ఆ తరువాత వరుసగా చిన్నా పెద్దా సినిమాలొచ్చాయి. ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమాతో తొలి బిగ్‌ హీరో హిట్‌ ను తన ఖాతాలో వేసుకుంది. అప్పటివరకు కిక్‌ 2 - బ్రూస్‌ లీ వంటి సినిమాలు ఘోరంగా దెబ్బేశాయి. అయినా కూడా రకుల్‌ ఎక్కడా తొణకలేదు. నాన్నకు ప్రేమతో సినిమాకు ఏకంగా డబ్బింగ్‌ కూడా చెప్పుకొని ఇంప్రెస్‌ చేసింది.

అందుకేనేమో.. ఇప్పుడు సడన్‌ గా ఆధ్యాత్మిక రూట్‌ తీసుకుంది రకుల్‌. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని తన ఫ్యామిలీతో కలసి దర్శించుకుంది. అంతే కాదు.. ఆన్‌ ది వే ఇంకా చాలా గుళ్లలో అభిషేకం చేయిస్తుందట. పైగా మేకప్‌ లేకుండా తిరిగేస్తే.. అందరితో ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాదు.. మీడియాతో కూడా ముచ్చటిస్తోంది. హ్యాపీ హ్యాపీగా ఉన్నారేంటి అంటే.. ఒక చిరునవ్వు నవ్వింది. ఒక ప్రక్కన పెద్ద సినిమా హిట్టయ్యింది. చేతిలో ఇంకా 3-4 పెద్ద సినిమాలున్నాయి. అంతే కాకుండా కొత్తగా జిమ్‌ బిజినెస్‌ కూడా మొదలుపెట్టింది. ఇంకేం కావాలి ఎవరికైనా.. అందుకే హ్యీపీగా దేవుడికి థ్యాంక్‌ చెప్పుకుంటోంది. అది సంగతి.