Begin typing your search above and press return to search.

రకుల్ స్వర సౌందర్యం సూపర్

By:  Tupaki Desk   |   13 Jan 2016 11:19 AM GMT
రకుల్ స్వర సౌందర్యం సూపర్
X
ఈ తరం హీరోయిన్లు అందాల ఆరబోతకే పరిమితవుతున్నారన్నది అందరికీ తెలిసిన నిజం. పెర్ఫామెన్స్ తో అప్పుడప్పుడూ అదరగొట్టే అవకాశం అతి కొద్ది మందికి వస్తోంది. అయితే.. ఇది కేవలం ఆన్ స్క్రీన్ మాత్రమే. ఆ నటనకు ప్రాణం పోసే స్వరాన్ని మాత్రం అరువు తెచ్చుకోవాల్సిందే. టాప్ హీరోయిన్ల అందరి పరిస్థితి ఇదే. కానీ కొత్తగా వచ్చిన కుర్ర హీరోయిన్ అయినా.. రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

జూనియర్ ఎన్టీఆర్ సరసన నాన్నకు ప్రేమతో చిత్రం కోసం సొంతగా డబ్బింగ్ చెప్పాలన్న నిర్ణయమే మొదట షాక్ ఇచ్ిచంది. మరి అమ్మడి గొంతు సినిమాలో ఎలా ఉంటుందనే సందేహాలు మాత్రం కొంతమందిని వేధించిన మాట వాస్తవమే. సాధారణంగా చాలామంది అందమైన భామల గొంతులు.. డబ్బింగ్ లో ఏమాత్రం ఆకట్టుకునే ఉండవు. గతంలో సమంత - కాజల్ - తమన్నాలు కూడా సొంతగా డబ్బింగ్ చెప్పుకునేందుకు ఓ ట్రయల్ వేసినవారే. కానీ వీరి గొంతులు డబ్బింగ్ కు అనువుగా లేవని తేల్చేయడంతో.. ఫైనల్ వెర్షన్ లో డబ్బింగ్ ఆర్టిస్టులతో పని కానిచ్చేయాల్సి వచ్చింది. కానీ రకుల్ ప్రీత్ కి ఆ ప్రాబ్లెం ఎదురుకాలేదు. ఆమె వాయిస్ బాగా సెట్ అయిందని, చాలా స్వీట్ గా ఉందనే ప్రశంసలు వస్తున్నాయి.

అంతే కాదు.. తొలి సారే గొంతు ఇచ్చినా.. తెలుగు రాకపోయినా.. చాలా సహజంగా డబ్బింగ్ చెప్పేసిందని పొగిడేస్తున్నారు. తెలుగు పదాలను కూడా చాలా అందంగా జాగ్రత్తగా పలికిన తీరుకు ప్రశంసలు వస్తున్నాయి. ఇక నుంచి రకుల్ తన అన్ని సినిమాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పేస్తుందని ఎక్స్ పెక్ట్ చేసేయచ్చు.