Begin typing your search above and press return to search.

డిటెక్టివ్ రకుల్ అయ్యేలా ఉందే!

By:  Tupaki Desk   |   30 Nov 2018 7:54 AM GMT
డిటెక్టివ్ రకుల్ అయ్యేలా ఉందే!
X
ప్రశ్నలు అనేవి ఎప్పుడూ మనల్ని ఇబ్బంది పెట్టేవే. చిన్నప్పుడు ఎగ్జాం లో ప్రశ్నలు.. పెద్దైతే అమ్మానాన్నల ప్రశ్నలు.. పెళ్ళైతే పెళ్ళాం ప్రశ్నలు.. పిల్లలుంటే వాళ్ళ ప్రశ్నలు.. ఇలా వీటికి అంతూపంతూ ఉండదు. కానీ ప్రశ్నలకు సరైన సమాధానం చేపడం ఒక కళ. ఆ కళ బ్యూటిఫుల్ రకుల్ దగ్గర ఉన్నట్టుంది. రీసెంట్ గా ఒక మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ప్రశ్నలకు ఒక రెడ్ హాట్ సమాధానం ఇచ్చింది.

ఇంతకీ రకుల్ కు ఎదురైన ప్రశ్న ఏంటంటే "మీరు ఒక 24 గంటలపాటు అదృశ్యమై పోగలిగితే ఏం చేస్తారు?" దీనికి రకుల్ ఇచ్చిన సమాధానం "#మీటూ కు సంబంధించి ఎవరు నిజాలు చెబుతున్నారో ఎవరు అబద్దాలు చెబుతున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది.. ఆ పనిమీదే ఉంటా." ఇప్పటివరకూ రకుల్ అంటే హాట్.. బ్యూటిఫుల్.. జిమ్ లో ఏవో కఠినమైన కసరత్తులు చెస్తూ ఉంటుందని అనుకున్నాం గానీ ఇలా లోపల ఒక డిటెక్టివ్ యాంగిల్ ఉందా?

ఈ సంగతేమో గానీ రకుల్ మాత్రం తన కెరీర్లో ఫుల్ బిజీగా ఉంది సూర్య 'ఎన్ జీకె'.. కార్తి 'దేవ్' తో శివకార్తికేయన్ హీరోగా నటించే మరో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇవి కాకుండా మరో రెండు హిందీ సినిమాలు లైన్లో ఉన్నాయి.