Begin typing your search above and press return to search.
మధ్యలోనే రుస రుసా వెళ్లిపోయిందట!
By: Tupaki Desk | 9 Sep 2019 7:41 AM GMTభారీ ఈవెంట్ల ప్రహసనం గురించి ఏమని చెప్పాలి. లెక్కకు మిక్కిలిగా వక్తలు వేదిక ఎక్కితే ఇక అంతే సంగతి. ఆ స్పీచ్ ల భజంత్రీ ఎలా ఉంటుందో ఊహించనలివి కానిది. టాలీవుడ్ ఆడియో ఈవెంట్లు- ప్రీరిలీజ్ ఈవెంట్లకు పూటల కొద్దీ సమయం నీళ్లలా ఖర్చయిపోతుంటుంది. అయినా ఆ కార్యక్రమం మొత్తం మీడియా వాళ్లు ఎంతో ఓపిగ్గా కవర్ చేస్తుంటారు. అయితే ఏమైందో కానీ నిన్నటి రాత్రి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ (మేనేజర్స్) రజతోత్సవ ఈవెంట్ నుంచి అందాల రకుల్ ప్రీత్ సింగ్ రుసరుసలాడుతూ మధ్యలోనే వెళ్లిపోయిందట.
రకుల్ కి ఎందుకంత కోపం వచ్చింది.. అసలేమైంది? అని ఆరా తీస్తే.. తాను లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు గంటల కొద్దీ సమయం వెచ్చించి ఓపిగ్గా వేచి చూసిందట. అయితే వక్తల భజంత్రీల నడుమ ఎంతకూ ఆ ఛాన్స్ రాకపోయే సరికి అక్కడ వెయిట్ చేసే ఓపిక సన్నగిల్లిందట. స్టేజీపై పూజా హెగ్డే- రాశీఖన్నా- అనసూయ- దేవీశ్రీ .. వీళ్లంతా ఓవైపు లైవ్ పెర్ఫామెన్సెస్ తో దుమ్ము దులిపారు. అలాంటి ఛాన్స్ కోసం రకుల్ కూడా చాలానే వెయిట్ చేసింది. కానీ ఈ మధ్యలో వక్తలు వేదికపైకి వచ్చి స్పీచ్ లు దంచేయడం అది కాస్తా టైమ్ తినేయడంతో రకుల్ కి ముక్కు మీద కోపం పొడుచుకొచ్చిందట. చాలా సేపు ఎదురు చూసి చూసి ఇక లాభం లేదనుకుని నిర్వాహకులకు కూడా చెప్పకుండా అక్కడి నుంచి పలాయనం చిత్తగించిందట.
మెగాస్టార్ చిరంజీవి- చిన్నజీయార్ స్వామి- రెబల్ స్టార్ కృష్ణం రాజు- ఎస్వీ కృష్ణా రెడ్డి- అల్లు అరవింద్ .. ఇలా వక్తలంతా వేదికను షేర్ చేసుకుని తమ అమూల్యమైన స్పీచ్ లతో అదరగొట్టారు. మరి ఇంతమంది స్పెషల్ గెస్టులు ఉన్నప్పుడు కాస్త అటూ ఇటూగా అవుతుంది. ఓపిక పట్టాల్సి ఉంటుంది. అయినా అంత లేటయినా సాటి కథానాయికలు పూజా హెగ్డే- రాశీ ఖన్నా పెర్ఫామెన్సులు ఇచ్చారుగా.. కానీ రకుల్ మాత్రం సహనం కోల్పోయిందని చెప్పుకుంటున్నారు. మరి ఈ ఈవెంట్ నుంచి మిడిల్ డ్రాప్ అవ్వడానికి ఇది కాక వేరే ఇంకేదైనా కారణం ఉంటే రకుల్ నే స్వయంగా చెప్పాల్సి ఉంటుంది. ఓవైపు ముంబైలో ఏదైనా స్పెషల్ అసైన్ మెంట్ ఉండడం వల్ల విమానం ఎక్కేసే టైమ్ అయిపోయ జంప్ అయిపోతే అది వేరే కథ. మరి ఆ సీక్రెట్ మ్యాటర్ ఏదైనా ఉందా?.. రకుల్ స్వయంగా చెబుతుందేమో! అప్పటికే సమయాభావం ల్ల కమెడియన్లు కామెడీ స్కిట్లను పక్కన పెట్టేశారట. భారీ అవార్డుల వేడుకల సమయంలో అయితే అసలు సెలబ్రిటీకి కుర్చీ వేయడమే కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు విసుక్కున్నా ఏం లాభం ఉండదన్నది కుర్ర నాయికలు గుర్తెరగాలి.