Begin typing your search above and press return to search.
ఈ ముగ్గురు తారల ట్వీట్స్ ని చూస్తుంటే..
By: Tupaki Desk | 9 Aug 2017 6:57 AM GMTమరో రెండు రోజుల్లో మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. నీతిని-లై మరియు రానా- నేనే రాజు మంత్రి తో పాటు బోయపాటి దర్శకత్వంలో వస్తున్న బెల్లకొండ శ్రీనివాస్ "జయ జానకి నాయక" ఆగస్టు 11 నే టార్గెట్ చేశాయి. వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉండడంతో ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు రాగలరని ఎవరికీ వారు నమ్మకంతో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ రిలీజ్ వ్యవహారంపై రీసెంట్ గా కొన్ని విమర్శలు సైతం చెలరేగిన విషయం తెలిసిందే.
దీంతో ఈ ముగ్గురు సినిమాల తారలు గట్టిగానే పోటీపడనున్నారని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వినబడ్డాయి. కానీ వాటన్నిటికీ విరుద్ధంగా ఈ సినిమాలో నటించిన స్టార్స్ సంబాషించుకున్న తీరును చూస్తే వీరి మధ్య ఎలాంటి వాతావరణం ఉందొ అర్ధమవుతుంది. వీరు మాట్లాడుకున్నది డైరెక్ట్ గా కాదు.. వారి వారి ట్విట్టర్ అకౌంట్ ల ద్వారా ఒకరికి ఒకరు "అల్ ది బెస్ట్" చెప్పుకున్నారు. మొదట రానా తన సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న నితిన్ - రకుల్ సినిమాలు కూడా మంచి హాట్ అవ్వాలని కామెంట్ చేశాడు.
దీంతో వెంటనే రకుల్ - నితిన్ కూడా రానా కామెంట్స్ పై స్పందించారు. మొదటగా రకుల్ రానాకు కృతజ్ఞతలు చెబుతూ.. "సేమ్ టూ యు" ఈ పరిణామం తప్పకుండా ఆటను మలుపు తిప్పెదవుతుందని కామెంట్ చేసింది. అలాగే నితిన్ కూడా వారిద్దరికీ "అల్ ది బెస్ట్" చెబుతూ రీట్వీట్ చేశాడు. దీంతో మరో సారి రకుల్ నితిన్ కి విషెస్ చెబుతూ.. ద పవర్ ఆఫ్ సినిమా అని తనదైన శైలిలో కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ముగ్గురు తారల ట్వీట్స్ కన్వర్సేషన్స్ ని చూస్తుంటే..నిజంగా తారల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో అర్థంచేసుకోవచ్చు.