Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కుంద‌న‌పు బొమ్మ ఎవ‌ర‌మ్మా?

By:  Tupaki Desk   |   6 Jan 2020 11:21 AM GMT
ఫోటో స్టోరి: కుంద‌న‌పు బొమ్మ ఎవ‌ర‌మ్మా?
X
అందాల క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్ కెరీర్ డైల‌మా గురించి తెలిసిందే. 2019 ర‌కుల్ కి ఏమాత్రం క‌లిసి రాలేదు. అంత‌కుముందు వ‌ర‌కూ వ‌రుస‌గా స్టార్ హీరోల స‌రస‌న అవ‌కాశాలు అందుకున్న ర‌కుల్ కెరీర్ గ్రాఫ్ గ‌త ఏడాది ఒక్క‌సారిగా డౌన్ ఫాల్ అయ్యింది. మ‌న్మ‌థుడు 2 ఫ్లాప‌వ్వ‌డం త‌న‌కు పెద్ద‌ మైన‌స్ గా మారింది. ఇక 2020 త‌న‌కు క‌లిసొస్తుందా లేదా? అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేని ప‌రిస్థితి. కెరీర్ లో స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డితేనే ఈ అమ్మ‌డికి క‌లిసొస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

ఇక ఈ ఏడాది మూడు సినిమాల్లో న‌టిస్తోంది. త‌మిళంలో శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న భార‌తీయుడు 2 లాంటి క్రేజీ ప్రాజెక్టు చేస్తోంది. కాశివీ నాయిర్ తెర‌కెక్కిస్తున్న ఓ హిందీ చిత్రంలోనూ అవ‌కాశం అందుకుంది. కానీ తెలుగులో మాత్రం ఎందుక‌నో కెరీర్ ప‌రంగా పూర్తిగా జీరో అయిపోయింది. ఇక ప్ర‌స్తుతం ఉన్న ఠ‌ఫ్ కాంపిటీష‌న్ లో త‌న స్థానాన్ని కాపాడుకునేందుకు ర‌కుల్ చాలానే శ్ర‌మిస్తోంది.

నిరంత‌రం సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌తో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది ఈ భామ‌. తాజాగా ఇన్ స్టాలో ఓ స్పెష‌ల్ ఫోటోషూట్ ని షేర్ చేసింది ర‌కుల్. నుదిటిన పాపిడి బొట్టు.. మెడ‌లో హారం.. బంగారు వ‌ర్ణం బిజిలీ బ్రాండ్ టాప్ తో ర‌కుల్ హొయ‌లు యువ‌త‌రానికి స్పెష‌ల్ ట్రీట్ అనే చెప్పాలి. ముఖ్యంగా భారీత‌నం నిండిన‌ ఆ బంగారు ఆభ‌ర‌ణాలు అమ్మ‌డి లుక్ నే మార్చేశాయి. టాప్ టు బాట‌మ్ పింక్ ఎలివేష‌న్ మ‌త్తెక్కించింద‌నే చెప్పాలి. ఈ స్పెష‌ల్ డిజైన‌ర్ డ్రెస్ లో ర‌క‌ర‌కాల‌ భంగిమ‌ల్లో ర‌కుల్ ఇచ్చిన ఫోజులు యువ‌త‌రంలో వైర‌ల్ అవుతున్నాయి.