Begin typing your search above and press return to search.
నితిన్ పైనే ఆశలు పెట్టుకున్న రకుల్
By: Tupaki Desk | 3 April 2020 6:50 AM GMTటాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలుగొంది, అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. చిన్న సినిమాల హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి తరువాత స్టార్ హీరోల సరసన లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇటీవల తెలుగులో కాస్త స్లో అయినా తమిళ, హిందీ సినిమాలతో దూసుకు పోతోంది రకుల్. కన్నడ సినిమా గిల్లితో వెండితెరకు పరిచయం అయిన రకుల్, తరువాత కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. వెంటనే కోలీవుడ్ లోనూ అడుగుపెట్టేసింది అయితే ఈ భామకు తొలి సక్సెస్ రావటానికి మాత్రం చాలా సమయమే పట్టింది. 2009లో వెండితెరకు పరిచయం అయిన రకుల్ బ్రేక్ కోసం 2013 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో రకుల్ ఖాతాలో తొలి సక్సెస్ పడింది.
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ గా మోస్ట్ లక్కీ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుత పరిస్థితి ఏంటో చెప్పనక్కర్లేదు. గత రెండు సంవత్సరాలుగా ఈ అమ్మడి కెరీర్ డౌన్ ఫాల్ లో ఉంది. నాగార్జునతో నటించిన 'మన్మధుడు 2' నిరాశను కలిగించింది. తెలుగులో ఛాన్స్ లు లేకపోవడంతో తమిళంలో బిజీ అయ్యేందుకు ప్రయత్నించింది. అక్కడ కూడా ఒకటి రెండు సినిమాలు ఛాన్స్ లు వచ్చినా కూడా నిరాశే మిగిలింది. దాంతో బాలీవుడ్ లో తన అందాల ఆరబోతతో బిజీ అవ్వాలనే ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమయంలోనే ఈ అమ్మడికి టాలీవుడ్ నుండి ఆఫర్ దక్కింది. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ వారు నిర్మించబోతున్న చిత్రంలో హీరోయిన్ గా ఈ అమ్మడి ఎంపిక చేశారట.
ప్రస్తుతం నితిన్ చేస్తున్న చిత్రాలు పూర్తైన వెంటనే కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది. అయితే కరోనా కారణంగా షూటింగ్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఈ కొత్త సినిమా ప్రారంభంకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కు ఈ సినిమా డూ ఆర్ డై లాంటిది. ఈ సినిమా హిట్ అయితే తెలుగులో మళ్లీ బిజీ అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నితిన్ తో ఛాన్స్ రకుల్ కు సెకండ్ ఇన్నింగ్స్ గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంతో మరోసారి తన విజయాల పరంపర కొనసాగించి, యంగ్ హీరోలకి కూడా సెట్ అవుతానని నిరూపిస్తుందేమో చూడాలి.