Begin typing your search above and press return to search.
ఇండియన్-2 కోసం రకుల్ కసరత్తులు!
By: Tupaki Desk | 14 Nov 2022 12:30 PM GMT'కొండపొలం' తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీ అయిన సంగతి తెలిసిందే. హిందీ సినిమాలతోనే అమ్మడు క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. షూటింగ్..ప్రమోషన్ కార్యక్రమాలు అంటూ ఉత్తరాది నగరాలు చుట్టేస్తుంది. అడపాదడపా వివాదాల విషయంలోనూ తల పెడుతుంది. పాన్ ఇండియన్ తెలుగు సినిమాల్లో అవకాశాలు కల్పించాలని ఆ మధ్య గుసాయించింది.
ఆ తర్వాత లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో తన లాంటి ప్రతిభావంతురాలకి ఛాన్సులు ఇవ్వాలని..అప్పుడే తమెంటో నిరూపించుకోగలమని కాస్త సౌత్ పరిశ్రపై అసంతృప్తి భావనని బయట పెట్టింది. అయినా అమ్మడి బాధని ఎవరూ పట్టించుకోలేదు. ఎవరు పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సౌత్ లో చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉంది అంటే అది ఇండియన్-2 మాత్రమే.
అమ్మడు ఇక్కడ బిజీగా ఉన్న సమయంలో శంకర్ దృష్టిలో పడటంతో ఆ ఛాన్స్ వరించింది. ఈ సినిమాపై రకుల్ భారీ ఆశలే పెట్టుకుంది. ఏకంగా తొలిసారి దేశం గర్వించదగ్గ దర్శకుడిగా పనిచేసే అవకాశం లభించడంతో శాయశక్తులా తన ఎఫెర్ట్ అంతా పెట్టి పనిచేయాలని కసిగా ముందుకెళ్తుంది. దీనిలో భాగంగా శంకర్ ఆదేశాలకు మేరకు అమ్మడు శరీరాన్ని సాన బెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ -2 కోసం రకుల్ జిమ్ములో గంటల తరబడి వర్కౌట్లు చేస్తోందిట. అందులోనూ శిక్షకుడి ఆధ్వర్యంలో హెవీ వర్కౌట్లు చేస్తుంది. లెగ్ ప్రెస్ లు..వెయిట్ స్వ్యాట్ వ్యాయామాలకి ఎక్కువగా సమయం కేటాయిస్తుందిట. ఉదయం..సాయంత్రం వేళలో వీలైనంత వరకూ టఫ్ టాస్క్ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వ్యాయామానికి సంబంధించిన వీడియోలు అభిమానులకు షేర్ చేసి వాళ్లని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రకుల్ కష్టాన్ని తన వరకే కాకుండా తనెంత శ్రమిస్తుందో నలుగురికి కూడా షేర్ చేసి స్ఫూర్తిని నింపుతుంది. సాధారణంగా రకుల్ మంచి ఫిట్ నెస్ ప్రీక్. సీనియర్ భామల్లో రకుల్ కి ఆ రకంగా మంచి పేరుంది. ఫిట్ నెస్ ని కాపాడుకోవడంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది.
క్రమం తప్పకుండా ఎప్పటికప్సుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాంటి భామని శంకర్ లాంటి స్టార్ మేకర్ ఆదేశిస్తే ఇంకే రేంజ్ లో శ్రమిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా ఛాన్స్ తో ఎగిరి గంతేసే అవకాశం వచ్చింది కాబట్టి రకుల్ సత్తా చాటుతుందని మెజార్టీ వర్గం భావిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.