Begin typing your search above and press return to search.

నాని డైరెక్టర్ తో హీరో రామ్

By:  Tupaki Desk   |   26 Feb 2018 6:58 AM GMT
నాని డైరెక్టర్ తో హీరో రామ్
X
నేను శైలజ లాంటి సూపర్ హిట్ అయినప్పటికి, వెంటనే హైపర్ మరియు ఉన్నది ఒకటే జిందగి ఫ్లోప్స్ అవ్వడంతో హీరో రామ్ కెరీర్ లో డీలా పడిపోయాడు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనైనా హిట్ కొట్టాల్సిందే అనే కసితో నేను లోకల్ లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన తో ఒక సినిమా ఓకే చేశాడు.

ప్రతి సినిమాలోనూ ఎదో ఒక కొత్తదనం వెతికే రామ్ తన స్టైల్ ను కూడా ప్రతి సినిమాకు మార్చడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అదే విధంగా ఈ సినిమా లో కూడా చాలా ట్రెండీ గా కనిపించబోతున్నాడు అని టాక్. స్టైల్ మార్చాడు కానీ జోనర్ మాత్రం మార్చకుండా యాక్షన్ టచ్ ఉండే రొమాంటిక్ ఎంటర్టైనర్ నే మళ్ళీ ఎంచుకున్నాడు. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయని ఈ సినిమా ని ఫాన్స్ చిన్నగా #రామ్16 గా పిలుచుకుంటున్నారు.

ఈ సినీమా షూటింగ్ మార్చ్ 8నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఉన్నది ఒకటే జిందగి సినిమాలో నటించిన అనుపమ పరమేశ్వరన్ ఇందులో కూడా ఈ ఎనెర్గెతిచ్ హీరో తో జత కట్టబోతోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.