Begin typing your search above and press return to search.

రామ్ డబ్బులు తిరిగిచ్చేశాడటగా..

By:  Tupaki Desk   |   25 Oct 2017 7:40 AM GMT
రామ్ డబ్బులు తిరిగిచ్చేశాడటగా..
X
ఇప్పుడు తెలుగు ఇండస్ర్టీలో ఫిలిం నగర్లో జరిగి పంచాయితీలన్నీ చాలాసార్లు ఓపెన్ గా బయటకొచ్చేస్తున్నాయి. ఎవరన్నా కావాలనే వీటిని లీక్ చేస్తున్నారేమో తెలియదు కాని.. గత ఆదివారం ఫిలిం ఛాంబర్లో జరిగిన నిర్మాత బెల్లంకొండ సురేష్.. హీరో రామ్ మధ్యన గల పంచాయితీ గురించి ఇప్పుడు చాలా టాక్ వినిపిస్తోంది.

నిజానికి రభస సినిమాను రామ్ చేయాల్సింది. అయితే అప్పుడు అదే సినిమా కథను.. సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్లో చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకోవడంతో.. సినిమాను వెంటనే నందమూరి హీరోతో తీసేశాడు బెల్లకొండ. కాకపోతే అప్పటికే ఈ ప్రొడ్యూసర్ దగ్గర 1 కోటి రూపాయలను అడ్వాన్స్ తీసుకున్న రామ్ మాత్రం కంగుతిన్నాడట. అర్ధంతరంగా ప్రాజెక్టును ఎన్టీఆర్ దగ్గరకు తీసుకపోవడమే కాకుండా.. ఇప్పుడు అడ్వాన్స్ తిరిగివ్వమంటావా అంటూ.. తాను అడ్వాన్స్ తిరిగిచ్చేది లేదని రామ్ చెప్పాడట.

అయితే ఇప్పటివరకు విషయంపై కామ్ గా ఉన్న బెల్లకొండ.. సరిగ్గా ఉన్నది ఒకటే జిందగీ సినిమా రిలీజ్ టైము చూసుకుని.. ఛాంబర్ లో ఈ విషయంపై పంచాయితీ పెట్టినట్లు తెలుస్తోంది. దానితో రామ్ కూడా విషయాన్ని పెద్దది చేసుకోకుండా.. తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగివ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే అడ్వాన్స్ ఇవ్వకపోయినా పర్లేదు.. సినిమా చేయమని అడిగాడట బెల్లకొండ.. కాని రామ్ అందుకు ఒప్పుకోలేదట. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు కాని.. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.