Begin typing your search above and press return to search.
రామ్ లో ఎనర్జీ దేవీలో ఎనర్జీ ప్లస్
By: Tupaki Desk | 30 Sep 2015 6:33 AM GMTరామ్ అంటే ఎనర్జిటిక్ హీరో. అందుకు తగ్గట్టే శివమ్ లాంటి ఎనర్జిటిక్ టైటిల్ ని పెట్టారు ఈసారి. ఇందులో ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్ కట్టాడు. యూత్ లో ఓ రేంజులో హల్ చల్ చేస్తున్నాయి ఈ పాటలు. ఎఫ్ ఎంలోనూ పాపులర్ సాంగ్స్ గా అలరిస్తున్నాయి. చార్ట్ బస్టర్ లిస్టులో చేరిన పాటలతో శివమ్ కి ఇప్పటికే క్రేజు రెట్టింపైది. జగడం - రెడీ తర్వాత హ్యాట్రిక్ కొట్టేయాలని దేవీ ఈ సినిమా కోసం చాలానే శ్రమించాడని అర్థమవుతోంది. ఈ పాటల ఆల్బమ్ లో 'అందమైన లోకం...' - 'ప్రేమ అనే ఒక పిచ్చి...' - 'గుండె ఆగిపోతాందే...' - 'శివమ్ శివమ్...' ఇలా పాటలన్నీ వేటికవే ప్రత్యేకంగా ఉన్నాయి.
రామ్ ఎనర్జీకి తగ్గట్టే యూత్ ఫుల్ బీట్స్ ఇవ్వాలని చేసిన ఎటెంప్ట్ ఇది. అందుకే శివమ్ పాటలు యూత్ లో పాపులర్ అయ్యాయని దేవీ చెబుతున్నాడు. భాస్కరభట్ల ఈ చిత్రానికి లిరిక్స్ రాశారు. ఇదే చిత్రంలో గాయకుడు మురళి (లేట్) తనయురాలు హరి ప్రియ తో ఓ పాట పాడించాడు దేవీ. నవతరం ట్యాలెంటును ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే దేవీ ఈసారి అదే ప్రయత్నంతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ప్రయత్నం బావుంది. హ్యాట్రిక్ హిట్ రావాల్సి ఉందింకా. శివమ్ అక్టోబర్ 2న రిలీజవుతోంది. హిట్టయితేనే పాటలకు గుర్తింపు. హిట్టవ్వని సినిమాలకు గుర్తింపు దక్కదు .. ఈ సంగతిని నిర్మాత స్రవంతి రవికిషోర్ పలు వేదికలపై చెప్పకనే చెప్పారు. కాబట్టి శివమ్ పెద్ద విజయం సాధించి దేవీ ఆల్బమ్ కి మరింత గుర్తింపు దక్కాలని కోరుకుందాం.