Begin typing your search above and press return to search.
రామ్ రామ.. ఇంత అవసరమా?
By: Tupaki Desk | 28 March 2018 4:38 AM GMTపీస్వీ గరుడవేగ అంటూ దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. టాలీవుడ్ కి మాంచి థ్రిల్లర్ ను ఇచ్చాడు. ఇలాంటి రేసీ థ్రిల్లర్ ఇప్పటివరకూ టాలీవుడ్ స్క్రీన్ పై రాలేదనే పేరు సంపాదించుకున్నాడు. అంతకుముందు గుంటూరు టాకీస్ అంటూ నాటు యాంగిల్ లో ఓ హిట్ కొట్టిన ప్రవీణ్ తో.. ఇప్పుడు యంగ్ హీరో రామ్ ఓ సినిమా చేస్తున్నాడు.
ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ చిత్రాన్ని కూడా డిఫరెంట్ గానే తీయబోతున్నాడట ప్రవీణ్ సత్తారు. ఎనర్జిటిక్ హీరో అసలు ఈ చిత్రం యాక్సెప్ట్ చేయడానికి రీజన్ కూడా అదే అంటున్నారు. కంప్లీట్ గా స్నో థీమ్ తోనే ఈ చిత్రం సాగుతుందట. అందుకోసమే సినిమాలో చాలా భాగాన్ని స్విట్జర్లాండ్.. ఐస్ ల్యాండ్ లలో తీయనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం భారీ బడ్జెట్ ను కూడా కేటాయిస్తోందట రామ్ కి హోమ్ ప్రొడక్షన్ కంపెనీ స్రవంతి మూవీస్. అయితే.. మంచులో షూటింగ్ అంటే చాలా టైమ్ వేస్ట్ అవుతుంది. ఒకే షాట్ ను అనేక మార్లు పిక్చరైజ్ చేసి.. వాటిలో విజువల్ గా బెస్ట్ అనేదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది.
అంతే కాదు.. కొన్ని షాట్లకు విజువల్ ఎఫెక్ట్స్ తప్పనిసరిగా చేయాలి. అంటే ఖర్చు ఆటోమేటిగ్గా పెరిగిపోతుందన్న మాట. పైగా ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్ కూడా. ప్రవీణ్ సత్తారు అంటే డిఫరెంట్ మూవీస్ అందిస్తాడని జనాల్లో కాన్ఫిడెన్స్ ఏర్పడింది కానీ.. మరీ బడ్జెట్ శృతి మించిపోతే.. దాన్ని రికవర్ చేయడం హీరోకు తలకు మించిన భారం అయిపోవచ్చు. మరి రామ్- ప్రవీణ్ లు కలిసి ఏం చేయనున్నారో చూడాలి.