Begin typing your search above and press return to search.

'హైపర్' చూపిస్తున్న హీరో రామ్‌

By:  Tupaki Desk   |   11 July 2016 5:21 PM IST
హైపర్ చూపిస్తున్న హీరో రామ్‌
X
మామూలుగానే మనోడు ఎనర్జటిక్‌ స్టార్‌. దానికితోడు కాస్త డోసు పెంచి అత్యధికంగా ఆ హైపర్ ను మనకు చూపిస్తే ఎలా ఉంటుంది? గతంలో 'కందిరీగ' సినిమాలో అలాంటి డోసును ఓ రేంజులో చూపించిన రామ్‌.. ఇప్పుడు మరోసారి చూపించడానికి సిద్దపడుతున్నాడు.

సంతోష్‌ శ్రీనివాస్‌ అనే సినిమాటోగ్రాఫర్ ను దర్శకుడిగా ఇంట్రొడ్యూస్ చేస్తూ.. రామ్ అప్పట్లో ''కందిరీగ'' సినిమాను చేశాడు. కంటెంట్ పరంగా రొటీన్ గానే ఉన్నా కూడా.. ఎందుకో సినిమాలో మనోడి ఎనర్జీ లెవెల్ తెగ నచ్చేసింది ప్రేక్షకులకి. అందుకే సినిమా మాంచి హిట్టయ్యింది. ఆ తరువాత రభస సినిమాతో కాస్త తడబడిన కందిరీగ డైరక్టర్ ఇప్పుడు రామ్ తో మరో సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు ''హైపర్'' అనే టైటిల్‌ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్‌ చూపించే హైపర్ ఎనర్జీ మామూలుగా ఉండదట. అందుకే సినిమాకు ఆ పేరును పెట్టాం అంటున్నారు.

ఇకపోతే ఈ సినిమా కోసం రామ్‌ హీరోయిన్‌ గా రాశి ఖన్నాను ఎంచుకున్నాడు. 'శివం' సినిమాతో ఈ భామతో కలసి ఒక మేజర్ ఫ్లాపు కొట్టినప్పటికీ.. ఇప్పుడు మరోసారి ఈ జోడీ హిట్టవుతుందని ప్రూవ్ చేస్తాం అంటున్నారు మేకర్లు.