Begin typing your search above and press return to search.
లింగుస్వామి పై నిర్మాత ఫిర్యాదు..? #RAPO19 పై ఎఫెక్ట్ పడనుందా..?
By: Tupaki Desk | 25 Jun 2021 4:30 PM GMTతమిళ దర్శకుడు లింగుస్వామి డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'రన్' 'పందెంకోడి' 'ఆవారా' 'సికిందర్' 'పందెంకోడి 2' వంటి సినిమాలను లింగుస్వామి తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ క్రమంలో ఉస్తాద్ రామ్ పోతినేని తో ఇటీవలే ఓ ద్విభాషా చిత్రాన్ని ప్రకటించారు. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేయబడిన #RAPO19 షూటింగ్ జూలై రెండో వారం నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలావుంటే లింగుస్వామికి సంబంధించిన ఓ వివాదం ఇప్పుడు బయటకు వచ్చింది. డైరెక్టర్ లింగుస్వామి - నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య ఎప్పటి నుంచో పరిష్కారం కాని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ వివాదంపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది. జ్ఞానవేల్ గతంలో దీనిపై ఫిలిం ఛాంబర్ కు కూడా ఫిర్యాదు చేసారు. కోర్టు పరిధిలో ఉన్న విషయంపై కలుగజేసుకోలేమని ఛాంబర్ తెలిపింది. అయితే లింగుస్వామి లేటెస్టుగా రామ్ తో సినిమా అనౌన్స్ చేయడంతో.. జ్ఞానవేల్ రాజా మళ్ళీ దర్శకుడిపై కంప్లైంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈసారి టాలీవుడ్ లోని ఫిర్యాదు చేసినట్లు టాక్ నడుస్తోంది. లింగుస్వామితో తనకున్న ఆర్థిక లావాదేవీలు తేలేదాకా దర్శకుడు మరో సినిమాని డైరెక్ట్ చేయకుండా చూడాలనేది దీని ప్రధాన ఉద్దేశ్యమట. దీంతో రామ్ బైలింగ్విల్ సినిమాపై లింగుస్వామి వివాదం ప్రభావం చూపుతుందేమో అని ఫిలిం సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.