Begin typing your search above and press return to search.
దేవదాసుకు పన్నెండేళ్లు
By: Tupaki Desk | 11 Jan 2018 3:48 PM GMTటాలీవుడ్ లో ప్రస్తుతం యువ హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో ఎవరికీ వారు ఒక ప్రత్యేకమైన స్టైల్ ని ఇమేజ్ ను దక్కించుకున్నారు. అలాంటి వారిలో రామ్ పోతినేని ఒకడు. వచ్చిన కొన్నాళ్లకే ఛాక్లేట్ బాయ్ అని గుర్తింపు కూడా అందుకున్నాడు. రామ్ మొదటి సినిమాను ఎవరు మరచిపోలేరు. 2006 లో వచ్చిన దేవదాసు సినిమా ద్వారా రామ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
దేవదాసు నార్మల్ హిట్ అనడం పొరపాటే అవుతుందేమో. వైవిఎస్. చౌదరి నిర్మాతగా వ్యవహరించి దర్శకత్వం చేసిన ఆ సినిమా బయ్యర్స్ కి కూడా కాసుల వర్షాన్ని కురిపించింది. అంతే కాకుండా హీరో రామ్ కి అలాగే ఇలియానా కెరీర్ కి మంచి బూస్ట్ ని ఇచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే ఆ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 12 ఏళ్లు పూర్తవుతోంది. ఈ విషయాన్ని రామ్ సోషల్ మీడియా ద్వారా ఒకసారి గుర్తు చేసుకున్నాడు.
15 ఏళ్ల బాలుడు అప్పుడు కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాడు అంటూ మిగతా లైఫ్ లో కూడా అదే తరహాలో ప్రయత్నాలు చేస్తాను అని రామ్ ట్వీట్ చేశాడు. రామ్ కెరీర్ లో నిజంగా ఆ సినిమా మరచిపోలేనిదని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఛక్లేట్ బాయ్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో చేయడానికి సిద్దమవుతున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఆ సినిమా తెరకెక్కనుంది.