Begin typing your search above and press return to search.

హీరోయిన్లను మారుస్తున్నాడు మరి..

By:  Tupaki Desk   |   4 May 2016 5:32 PM GMT
హీరోయిన్లను మారుస్తున్నాడు మరి..
X
నిజానికి ఒక సినిమా ఫ్లాప్‌ అయ్యిందంటే.. వేరియస్‌ రీజన్స్‌ ఉంటాయి. అయితే సాధారణంగా ఆ సినిమాలో చేసిన హీరో అండ్‌ హీరోయిన్‌ కాంబినేషన్‌ ను మాత్రం.. మనోళ్ళు ఫ్లాప్‌ కాంబినేషన్‌ అంటుంటారు. అలా చూసుకుంటూ.. చాలామంది స్టార్‌ హీరో అండ్‌ హీరోయిన్ల కాంబినేషన్‌ ఫ్లాపనే చెప్పాలి. అలా చూసుకుంటే హీరో రామ్‌ తో.. మిల్కీ తమన్నా.. చబ్బీ రాశి ఖన్నా వంటి భామలందరూ ఫ్లాప్‌ పెయిరింగ్‌ అనుకోవాల్సిందే మరి.

ఇకపోతే త్వరలోనే తనకు 'కందిరీగ'తో ఆ మధ్య ఒక ఎడతెరిపి హిట్‌ ఇచ్చిన వాసు ఎలియాస్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా చేయడానికి రంగం సిద్దం చేసుకున్నాడు రామ్‌. చాలా కథలు విన్నాక.. ఇతగాడి కమర్షియల్‌ ఫార్ములా కథ అయితే బెటర్‌ అనుకున్నాడట. ఈ సినిమాకు ముందుగా తమన్నాను హీరోయిన్‌ గా అనుకున్నారు. కాకపోతే తమన్నా అనేసరికి ఎందుకంటే ప్రేమంట అనే ఫ్లాప్‌ మూవీ గుర్తొచ్చిందట. అందుకే ఆమెను తీసేసి ఇప్పుడు రాశి ఖన్నాను తీసుకున్నాడు రామ్‌. మరి ఈ అమ్మడితో శివం అనే సూపర్‌ ఫ్లాప్‌ చేశావుగా నాయనా?

పోనివ్‌ లేదంటే తమన్నా అండ్‌ రాశి ఇద్దరినీ తీసుకుంటే బెటరేమో. ఎందుకంటే ఇద్దరూ కలసి అప్పట్లో బెంగాళ్ టైగర్‌ అంటూ రవితేజకు కాస్త రిలీఫ్‌ ఇచ్చారు. 'నేను శైలజ' సినిమాతో చాలా రోజుల తరువాత ఒక హిట్‌ అందుకున్న రామ్‌.. ఇప్పుడేం చేస్తాడో చూడాలి.