Begin typing your search above and press return to search.
రామ్ బాబూ.. వినిపించాయా ఆ కేకలు?
By: Tupaki Desk | 2 Jan 2016 5:30 PM GMT‘వర్షం’ సినిమాలో ప్రభాస్ చేతి బోరు పంపు లాగి విలన్లను బాదేస్తే ఏం ఎబ్బెట్టుగా, అతిశయోక్తిగా అనిపించలేదు జనాలకు. ఎందుకంటే అతడి రూపం అలా ఉంటుంది మరి. అదే ఓ బక్క హీరో, అందులోనూ పెద్దగా మాస్ ఇమేజ్ లేని కథానాయకుడు అలా చేస్తే జనాలు నవ్వుకునేవారు. కాబట్టి ఏ హీరో అయినా సరే.. తమకు ఏది నప్పుతుందో అది చేస్తే బాగుంటుంది. కానీ మన ఇండస్ట్రీలో మాస్ సినిమాల మీద హీరోలకు మోజెక్కువ. తమ ఇమేజికి సూటవుతుందా లేదా అని చూసుకోకుండా మరీ ఎక్కువ హీరోయిజం చూపించాలని చూస్తుంటారు యువ కథానాయకులు. తమ బలం ఏంటన్నది మరిచిపోయి అతిగా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి బోల్తా కొడుతుంటారు.
ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసి దెబ్బ తిన్నాడు. నిజానికి అతడికి కొంచెం మాస్ టచ్ ఉన్న క్లాస్ లవ్ స్టోరీలైతే బాగుంటాయి. మాస్ సినిమాలు చేయడానికి ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కానీ క్లాస్ గా, చాక్లెట్ బాయ్ లాగా కనిపించే రామ్ మాస్ సినిమాల కోసం ఎగబడాల్సిన పని లేదు. హీరోయిజం ఓ మోస్తరుగా ఉంటే బాగుంటుంది కానీ.. అతను అతి చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. మొన్న వచ్చిన ‘శివమ్’ సినిమానే చూడండి. 20 మంది రౌడీల్ని అలవోకగా కొట్టేస్తూ గాల్లోకి ఎగరేసేస్తుంటే చూడ్డానికి చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. ఆ సినిమా ఆడలేదు కాబట్టి రామ్ లో మార్పు వచ్చిందేమో కానీ.. కొత్త సినిమా ‘నేను శైలజ’లో ఇలాంటి బిల్డప్పులేమీ ఇవ్వలేదు. చాలా మామూలుగా చేసుకెళ్లిపోయాడు.
ఇంతకుముందు చేసిన మాస్ సినిమాల్లో అవసరానికి మించి హీరోయిజం చేయడం వల్ల రామ్ ప్రేక్షకులకు కొంత చికాకు కూడా పుట్టించాడన్నది వాస్తవం. కానీ ‘నేను శైలజ’ అలాంటి అతి పూర్తిగా పక్కన పెట్టాడు. అయినప్పటికీ హీరోయిజం బాగానే ఎలివేట్ అయింది. ప్రేక్షకులతో విజిల్స్ కొట్టించుకోవడానికి పెద్ద ఫైటే చేయనక్కర్లేదు. ఒక మంచి డైలాగ్ చెప్పినా చాలు.. మంచి స్పందనే వస్తుంది. ‘నేను శైలజ’ థియేటర్లలో లోకి వెళ్లి చూస్తే ఆ సంగతి అర్థమవుతుంది. రామ్ పెర్ఫామెన్స్ కి అడుగడుగునా ఈలలు కేకలే. చివరికి విలన్ దగ్గరికి వెళ్లి చుట్టూ ఉన్న రౌడీల్ని కొట్టినప్పటి కంటే.. ‘‘నిన్ను టచ్ చేయను’’ అంటూ డైలాగ్ చెప్పి వెళ్తున్నపుడే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది జనాల నుంచి. మాస్ సినిమాలతో మాత్రం కలెక్షన్లు కొల్లగొట్టవచ్చనుకుంటే భ్రమేనని ఈ సినిమా రుజువు చేస్తోంది కూడా. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది ‘నేను శైలజ’. రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
రామ్ ఒద్దికగా నటిస్తే ఎంత బాగుంటుందో ‘నేను శైలజ’ రుజువు చేసింది. రామ్ ఇలాంటి సినిమాలు చేసినపుడు మిగతా దర్శకులు కూడా ఇక అతడి కోసం భిన్నమైన కథలు రాస్తారు. మంచి సినిమాలు వాటంతట అవే వస్తాయి. ఓ హీరో ఎలాంటి సినిమాలు చేస్తున్నాడన్నదాన్ని బట్టే కథలు కూడా అతణ్ని వెతుక్కుంటూ వస్తాయి. ‘నేను శైలజ’ ఆ దిశగా రామ్ కెరీర్ కు మంచి మలుపుగా భావించాలి. ఇకముందు కూడా రామ్ రొటీన్ సినిమాల గోల వదిలేసి.. తనలోని నటుణ్ని ఎలివేట్ చేసే పాత్రలే ఎంచుకుంటాడని ఆశిద్దాం.