Begin typing your search above and press return to search.

ఆచార్య దెబ్బ పై చరణ్ కామెంట్

By:  Tupaki Desk   |   13 Nov 2022 3:53 AM GMT
ఆచార్య దెబ్బ పై చరణ్ కామెంట్
X
మెగా హీరోలకు అందరిని ఎక్కువగా బాధకు గురి చేసిన సినిమా ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఇష్టంగా చేసిన ఈ ప్రాజెక్ట్ చివరకు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. దర్శకుడు కొరటాల శివ తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అత్యంత దారుణమైన నష్టాలను కలుగజేసింది. చివరికి మెగాస్టార్ చిరంజీవి తప్పంతా దర్శకుడిదే అన్నట్లు అది ఆయన సలహా అని కామెంట్ చేయడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఒక విధంగా కొరటాల శివ ఆ సినిమా ద్వారా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అని చెప్పవచ్చు. ఫైనాన్షియల్ గా కూడా డిస్ట్రిబ్యూటర్స్ అందరిని కొరటాల శివ దగ్గర ఉండి కూల్ చేయడం తెలిసిన విషయమే. ఇక ఎక్కడికి వెళ్లినా ఆచార్యకు సంబంధించిన ప్రశ్నలు మెగా హీరోలకు తలెత్తుతున్నాయి. ఇక రీసెంట్ గా రాంచరణ్ అడగకముందే చాలా సెన్సిటివ్ గా స్పందించే ప్రయత్నం చేశాడు.

RRR లాంటి పెద్ద సినిమా తర్వాత మరొక సినిమాలో గెస్ట్ రోల్ చేశాను అని అయితే ఆ సినిమాను చూసేందుకు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు అని అన్నాడు. హిందుస్థాన్ టైమ్స్ నిర్వ‌హించిన లీడ‌ర్ షిప్ స‌మ్మిట్‌లో పాల్గొన్న చ‌ర‌ణ్.. ఆచార్య పేరెత్త‌కుండా దాని గురించి వివరణ ఇచ్చారు. ఆడియన్స్ ఊహలు ఈ కాలంలో చాలా మారిపోయాయి అని సినిమాలో ఎంత పెద్ద స్టార్ ఉన్నా కూడా థియేటర్కు చూడడానికి రావడం లేదని కంటెంట్ బాగుంటేనే వారి నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది అని అన్నాడు.

ఈ రోజుల్లో చిన్న సినిమాల్లో కూడా మంచి కంటెంట్ ఉంటేనే భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటున్నాయని ఫైనల్ గా కంటెంట్ బాగుంటేనే ఆడియోస్ థియేటర్స్ కి వస్తారు అని చరణ్ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మెగాస్టార్ మరొక విధంగా స్పందించినప్పటికీ రామ్ చరణ్ మాత్రం దర్శకుడి పై మొత్తం నింద వేయకుండా చాలా సున్నితంగా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం విశేషం.