Begin typing your search above and press return to search.

చరణ్ ని చరణే కలిస్తే ఏం చెబుతాడో తెలుసా?

By:  Tupaki Desk   |   8 Dec 2016 5:03 AM GMT
చరణ్ ని చరణే కలిస్తే ఏం చెబుతాడో తెలుసా?
X
రామ్ చరణ్ నటించిన ధృవ సినిమా విడుదల దగ్గరపడుతుండడంతో ప్రమోషన్లు భారీ స్థాయిలో అమలు చేస్తున్నారు. విరివిగా ఇంటర్వ్యూలలో పాల్గొనడమేకాక సినిమాలో ముఖ్యమైన ఒక నిముషం సన్నివేశాన్ని విడుదలచెయ్యడం కొత్త పద్ధతినే చెప్పాలి.

ఈ క్రమంలో చరణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అతనికి ఒక కొత్త ప్రశ్న ఎదురైంది. 9 ఏళ్ళ తరువాత ఇప్పుడున్న చరణ్ ని టాలీవుడ్ లో రాకముందు వున్న చరణ్ కలిస్తే అతనికి ఎటువంటి సలహా ఇస్తారనే ప్రశ్న ఎదురైంది.

దానికి చరణ్ తెలివిగా నువ్వు ఎటువంటి దాని గురించి ఆలోచించకుండా నీకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళమని చెప్తాడట. అంటే దాదాపుగా ఎలాంటి సలహా ఇవ్వనని తెలిపాడు. అంతేకాక ఇప్పటిదాకా అతను చేసిన అన్ని సినిమాలూ ఎంతో నచ్చే చేశానని ఫలితాలపై పెద్దగా పట్టించుకోనని తెలిపాడు.