Begin typing your search above and press return to search.

అందుకోసమైనా 'ఆర్ ఆర్ ఆర్' చూడాలి: చరణ్

By:  Tupaki Desk   |   19 March 2022 5:43 PM GMT
అందుకోసమైనా ఆర్ ఆర్ ఆర్ చూడాలి: చరణ్
X
చరిత్రకు ఆసక్తికరమైన కల్పనను జోడించి రాజమౌళి రూపొందించిన సినిమానే 'ఆర్ ఆర్ ఆర్'. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా, వివిధ భాషల్లో ఈ నెల 25వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా కోసం దేశ విదేశాలకి చెందిన నటీనటులు .. సాంకేతిక నిపుణులు పని చేశారు. అలాంటి ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా తన ప్రత్యేకతను కనబరుస్తోంది. చిక్కబళ్లా పూర్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. వంద జాతరలు ఒక్కసారిగా .. ఒక్క చోట జరుగుతున్నట్టుగా జనాలు తరలి వచ్చారు.

ఈ స్టేజ్ పై చరణ్ మాట్లాడుతూ .. "అందరికీ నమస్కారం .. ఈ సందర్భంలో ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుకోవాలి .. ఆయనే పునీత్ రాజ్ కుమార్ గారు. ఆయన మన మధ్యలో లేరంటే నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలని లేదు .. నమ్మను కూడా. ఇక్కడే ఎక్కడో ఉండి మా అందరినీ ఆయన బ్లెస్ చేస్తూ ఉంటారు. ఆయన లేని లోటు మేము 'శివన్న' ద్వారా తీర్చుకుంటాము. ఇక ఈ ఫంక్షన్ కి విచ్చేసిన పెద్దలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సేపటి నుంచి అభిమానులంతా నుంచోనే ఉన్నారు.

ఈ ఈవెంట్ ను ఇంతగా సక్సెస్ చేయడానికి తరలి వచ్చిన తారక్ అభిమానులకు .. మెగా అభిమానులకు పేరు పేరున థ్యాంక్స్ చెబుతున్నాను. నిజంగానే మీరంతా ఒక షాడో మాదిరిగా మా వెంట ఉన్నారు. మీ కోసం మేము పడిన కష్టం .. శ్రమ మీకు చూపడానికి ఈ నెల 25న ఈ సినిమా వచ్చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుంటే ఎలా ఉందని అడుగుతున్నారు. నేను కూడా మీలాగే ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. రాజమౌళి గారి పనితనాన్ని చూడటం కోసమైనా మీరంతా థియేటర్స్ కి రావాలి. తెలంగాణ .. ఆంధ్రప్రదేశ్ తరువాత కర్ణాటక చాలా పెద్ద మార్కెట్.

దానయ్యగారి విషయానికి వస్తే మోస్ట్ డైనమిక్ ప్రొడ్యూసర్ .. ఆయనకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. కీరవాణిగారు చాలా గొప్ప సంగీతాన్ని అందించారు. ఆయన వర్క్ చేసిన ఈ సినిమాలో నేను ఉండటమనేది గర్వకారణంగా భావిస్తాను. ప్రతి పాట చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు. రాజమౌళి గారి టీమ్ లోని ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ ముగించారు.