Begin typing your search above and press return to search.
'శంకర్-చరణ్' ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా..?
By: Tupaki Desk | 3 Aug 2021 1:30 AM GMTస్టార్ డైరెక్టర్ శంకర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది చరణ్ కెరీర్ లో 15వ ప్రాజెక్ట్.. దిల్ రాజు బ్యానర్ కు 50వ సినిమా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
'ఇండియన్ 2' వివాదం కోర్టులో ఉండటంతో ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న శంకర్.. లీగల్ సమస్యలు తొలగిపోవడంతో '#RC15' సినిమా పనులు ముమ్మరం చేశారు. ఇటీవలే హైదరాబాద్ లో ల్యాండ్ అయిన అగ్ర దర్శకుడు.. అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. నటీనటులు సాంకేతిక నిపుణులను ఫైనలైజ్ చేయడంతో పాటుగా లొకేషన్స్ వెతికే పనిలో బిజీగా ఉన్నారు.
'శంకర్ - చరణ్' చిత్రాన్ని సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో సెట్స్ పైకి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీని కోసం ఇప్పటికే చెర్రీ కాల్షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు నెలాఖరుకు కంప్లీట్ అవుతుంది కాబట్టి.. చరణ్ సెప్టెంబర్ నెల నుంచి శనకర్ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేశారు.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలోని ఎక్కువ భాగం తెలంగాణ రాష్ట్రంలోనే షూట్ చేయనున్నారట. ఒక సినిమా పూర్తి చేయడం కోసం ఎక్కువ సమయం తీసుకునే శంకర్.. రామ్ చరణ్ చిత్రాన్ని మాత్రం వీలైనంత తక్కువ టైం లో చేయడానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. టైట్ షెడ్యూల్స్ ప్లాన్ చేసి 2022 జూన్ నాటికి షూటింగ్ పూర్తి చేస్తానని నిర్మాతతో ఒప్పందం చేసుకున్నట్లు టాక్.
ఇకపోతే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇది దిల్ రాజు బ్యానర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందే సినిమా. రామ్ చరణ్ జోడీగా 'వినయ విధేయ రామా' బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి బుర్రా సాయి మాధవ్ ను డైలాగ్ రైటర్ గా తీసుకున్నారు. తొలిసారిగా శంకర్ తెలుగులో చేస్తున్న ఈ స్ట్రెయిట్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.