Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన ఆర్ట్ డైరెక్ట‌ర్‌!

By:  Tupaki Desk   |   2 Nov 2022 2:41 PM GMT
చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన ఆర్ట్ డైరెక్ట‌ర్‌!
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్..ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన `RRR`తో వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఈ మూవీ అందించిన క్రేజ్ తో త‌న త‌దుప‌రి మూవీని దిగ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న విష‌యం తెలిసిందే. RC 15 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నార‌. కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో మ‌రో హీరోయిన్ గా అంజ‌లి క‌నిపించ‌బోతోంది.

తండ్రి, త‌న‌యులుగా రామ్ చ‌ర‌ణ్ ఈ మూవీలో ద్విపాత్రాభిన‌యం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల అండ్రి పాత్ర‌కు సంబంధించి అంజ‌లితో క‌లిసి వున్న ఫొటోలు నెట్టింట లీకై వైర‌ల్ అయ్యాయి. ఇప్ప‌టికే కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించి తాజా షెడ్యూల్ ని త్వ‌ర‌లోనే ప్రారంభించ‌బోతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత రామ్ చ‌ర‌ణ్ `జెర్సీ` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ష‌న్ లో ఓ భారీ ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్ ని చేయాల‌నుకున్నారు.

యువీ క్రియేష‌న్స్ ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మించాల‌ని ప్లాన్ చేసింది కూడా. అయితే `RRR` త‌రువాత మారిన స‌మీకార‌ణాలు, చ‌ర‌ణ్ మార్కెట్ స్థాయిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ ని ప‌క్క‌న పెట్టేశారు. ఈ విష‌యాన్ని చ‌ర‌ణ్ వ్య‌క్తిగ‌త సిబ్బంది ఇటీవ‌ల ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ ప్రాజెక్ట్ ని ప‌క్క‌న పెట్టిన రామ్ చ‌ర‌ణ్ క‌న్న‌డ డైరెక్ట‌ర్ నార్త‌న్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి.

దీనిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డంతో చ‌ర‌ణ్ .. శంక‌ర్ ప్రాజెక్ట్ త‌రువాత ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌బోతున్నాడ‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఆర్ట్ డైరెక్ట‌ర్ సాబు సిరీస్ ఊహించ‌ని అప్ డేట్ అందించి స‌ర్ ప్రైజ్ చేశారు. `RRR` రిలీజ్ కు ముందే రామ్ చ‌ర‌ణ్ సుకుమార్ తో సినిమా ని మొద‌ల‌లు పెట్టాడ‌ని, ఇందు కోసం 10 నిమిషాల ఫుటేజీని కూడా చిత్రీక‌రించార‌ని వెల్ల‌డించి షాకిచ్చాడు.

అయితే సుకుమార్ మాత్రం సినిమాలోని ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ కోసం చ‌ర‌ణ్ అదే త‌ర‌హాలో పూర్తి ఫిట్ నెస్ తో క‌ర‌నిపించాల‌ని డిమాండ్ చేస్తున్నార‌ట‌. అలా అయితేనే కంటిన్యూ చేస్తాన‌ని సుకుమార్ అంటున్నార‌ని సాబు సిరిల్ స్ప‌ష్టం చేయ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. సాబు సిరిల్ చెప్పింది నిజ‌మే అయినా సుకుమార్ `పుష్ప 2`ని పూర్తి చేయాలి. అంత వ‌ర‌కు చ‌ర‌ణ్ వేయిట్ చేయ‌గ‌లిగితే త‌న 16వ ప్రాజెక్ట్ సుకుమార్ దే అవుతుంది. తేదంటే మ‌రో ద‌ర్శ‌కుడు లైన్ లోకి రావ‌డం ఖాయం అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.