Begin typing your search above and press return to search.
చెర్రీ అమెరికా జంప్ .. కారణమిదే!
By: Tupaki Desk | 23 Jun 2019 4:46 PM GMTసరిగ్గా నెలన్నర గ్యాప్. ఈ గ్యాప్ లోనే చరణ్ షేపులు మారిపోయాయి. దీంతో జక్కన్న చెర్రీకి సీరియస్ స్ట్రోక్ ఇచ్చాడట. అందుకే ఏమీ ఆలోచించకుండా అమెరికా జంప్ అయిపోయేందుకు అతడు రెడీ అవుతున్నారన్నది తాజా అప్ డేట్.
అసలే ఆర్.ఆర్.ఆర్ సినిమాని రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటే ఇలా క్రమశిక్షణ తప్పితే ఎలా? ఏదో ఒకటి చేసి రూపం కాపాడుకోవాలి. జిమ్ములు ఆపేస్తే అసలే కుదరదు. కానీ చరణ్ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయన్నది జక్కన్న కంప్లైంట్ అట. యాక్సిడెంట్ పేరుతో చెర్రీ ఏకంగా 45రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. ఇటీవలే వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ కోసం భార్య ఉపాసన తో కలిసి ఆఫ్రికాకు వైల్డ్ లైఫ్ సెలబ్రేషన్స్ ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లోనే అతడు అంత వెయిట్ పెరిగాడు.
మొత్తానికి జక్కన్న ఒత్తిడితో అతడు అమెరికా వెళ్లి తిరిగి కావాల్సిన షేపులు తెచ్చుకునేందుకు శ్రమించబోతున్నాడట. ఆర్.ఆర్.ఆర్ ప్రారంభం అవుతోంది అనగానే చరణ్ అప్పట్లో అమెరికా వెళ్లి సరైన ట్రైనర్ సమక్షంలో షేపులు మార్చుకుని వచ్చాడు. ఇప్పుడు మరోసారి అదే శిక్షకుడి దగ్గరకే వెళుతున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇక కారణం ఏదైనా ఏదో ఒక రూపంలో ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణకు ఈ అడ్డంకులు తప్పడం లేదు. ఇటీవలే ఆలియా భట్ అనారోగ్యం కారణంగా పెద్ద పంచ్ పడింది. ఇప్పుడు మళ్లీ చరణ్ తిరిగి షేపుల్లోకి రావడానికి టైమ్ పడుతుంది. అంటే షెడ్యూల్స్ కి ఏదో ఒక రూపంలో బ్రేక్ పడినట్టే. ఇలా అయితే జక్కన్న ప్రకటించిన 2020 జూలై 31 రిలీజ్ కష్టమేనంటూ అప్పుడే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.