Begin typing your search above and press return to search.
గ్యాంగ్ లీడర్ తీస్తున్నావా శీను?
By: Tupaki Desk | 19 Jun 2018 5:50 AM GMTప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రామ్ చరణ్-బోయపాటి కాంబో లో రూపొందుతున్న స్టోరీ అవుట్ లైన్ వింటే కనక ఇదే సందేహం రాక మానదు. ఫామిలీ ఎమోషన్స్ ని లైట్ గా టచ్ చేస్తూ వయొలెన్స్ తో కూడిన యాక్షన్ డ్రామాను పండించడంలో సిద్ధహస్తుడైన బోయపాటి శీను ఇందులో కూడా అదే తరహా ఫార్ములాను వాడుతున్నట్టు షూటింగ్ అప్ డేట్స్ ని బట్టి తెలుస్తూనే ఉంది. ఇకపోతే ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన మెగా స్టార్ చిరంజీవి ఆల్ టైం బ్లాక్ బస్టర్ గ్యాంగ్ లీడర్ ఛాయలోనే ఇది రూపొందుతున్నట్టు వస్తున్న వార్త మెగా ఫాన్స్ ని ఒక వైపు ఆనందంలో మరోవైపు అయోమయంలో నెడుతోంది. అదెలాగో చూద్దాం. చరణ్ సినిమాలో హీరోకు ఐదుగురు అన్నయ్యలు ఉంటారట. వాళ్లంటే చెర్రీకి ప్రాణం. కానీ అందులో ఒకడిని విలన్ గ్యాంగ్ చంపేస్తుంది. ఇది చరణ్ కు తెలిస్తే ఎం జరుగుతుందో ఊహించి అది దాచి పెడుతూ వస్తారు. అనుకోని ఒక సంఘటన వల్ల అన్నయ్యను హత్య చేసారనే విషయం బయటపడుతుంది. దీంతో చరణ్ ఉగ్రరూపం దాల్చి విలన్ల భరతం పడతాడు. ఇది స్థూలంగా కథకు సంబంధించి లీకైన మెయిన్ లైన్
ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం. గ్యాంగ్ లీడర్ లో చిరుకి ఇద్దరు అన్నయ్యలు. మురళీమోహన్ ని విలన్ రావు గోపాల్ రావు ఒక కేసులో సాక్షిగా ఉన్నాడన్న నెపంతో చంపేస్తాడు. కానీ వేరే కేసులో జైల్లో ఉన్న చిరుని ఫ్రెండ్స్ ఇది యాక్సిడెంట్ అని నమ్మిస్తారు. ప్రీ క్లైమాక్స్ లో నిజాన్ని తెలుసుకుని విలన్ల అంతు చూస్తాడు. ఒకపక్క ఫ్యామిలీ డ్రామా మరోవైపు రివెంజ్ ని దర్శకుడు విజయబాపినీడు బాలన్స్ చేసిన తీరుకు బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిసింది. ఇప్పుడు చరణ్ సినిమాలో ఇద్దరు అన్నయ్యలను ఐదుగురిగా మార్చి హత్య అనే పాయింట్ ని కామన్ గా వాడుకున్నట్టు కనిపిస్తోంది. కాకపోతే అందులో హీరో మధ్యతరగతి ఫామిలీలో ఉంటే ఇందులో రాజ వంశస్థుడిగా చూపిస్తున్నారు. కాకతాళీయం ఏంటంటే గ్యాంగ్ లీడర్ లో ఒక అన్నయ్యగా తమిళ హీరో శరత్ కుమార్ నటిస్తే ఇప్పుడు చరణ్ అన్నయ్యల్లో ఒకడిగా ప్రశాంత్ చేస్తున్నాడు. సుమలత ప్లేస్ లో ఇక్కడ స్నేహ. అన్ని భలే కుదురుతున్నాయే అనుకుంటున్నారు అభిమానులు. ఇది ఖచ్చితంగా అదే తరహాలో రూపొందుతోందని అని చెప్పలేం కానీ ఇలాంటి పోలికలు నిజమే అనుకునేలా చేస్తున్నప్పుడు ఒప్పుకోక తప్పదు. కావాలంటే య ట్యూబ్ లో గ్యాంగ్ లీడర్ సినిమామీద ఓ లుక్ వేయండి.