Begin typing your search above and press return to search.

చిరు-చరణ్.. ఇద్దరికీ ఐష్ కావాలట

By:  Tupaki Desk   |   3 Jun 2017 7:09 AM GMT
చిరు-చరణ్.. ఇద్దరికీ ఐష్ కావాలట
X
సినీ పరిశ్రమలో తండ్రీ కొడుకులు ఇద్దరితోను హీరోయిన్ నటించిన రికార్డు పలువురు భామలు సొంతం చేసుకున్నారు. మొదట తండ్రితోను.. తర్వాత కొడుకుతోను సినిమాలు చేసిన సుందరాంగులు ఉన్నారు. అయితే.. ఇదే ఫీట్ ను రివర్స్ లో కంప్లీట్ చేసి కాజల్ ఈ మధ్యనే కొత్త రికార్డ్ సృష్టించింది. వీరందరికీ భిన్నంగా ఒకేసారి తండ్రీకొడులతో హీరోయిన్ గా నటించే అరుదైన అవకాశం మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ చెంతకు చేరినట్లు తెలుస్తోంది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధను తన 151వ చిత్రంగా తెరకెక్కించనున్నారు మెగాస్టార్ చిరంజీవి. పీరియాడిక్ ఫిలిం కావడంతో.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని నేషనల్ లెవెల్ ప్రాజెక్టుగా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ఈ మూవీ కోసం బాలీవుడ్ భామను తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ ను హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాన్సెప్ట్ బేస్డ్ మూవీ కావడం.. తన పాత్రకు కూడా తగిన ప్రాధాన్యం ఉండడంతో.. ఆమె నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాలేదని తెలుస్తోంది.

మరోవైపు రామ్ చరణ్- మణిరత్నం కాంబినేషన్ లో కూడా సినిమా ఖాయమే అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి కూడా హీరోయిన్ గా ఐశ్వర్యారాయ్ నే అనుకుంటున్నారట. మణిరత్నం లాంటి దిగ్గజ దర్సకడితో మూవీ చేసేందుకు ఐష్ నుంచి కూడా అబ్జెక్షన్ ఉండదన్నది ఓ టాక్. ఉయ్యాలవాడ షూటింగ్ జరుగుతుండగానే.. చరణ్ సినిమా కూడా మొదలయ్యే ఛాన్స్ ఉంది. అంటే.. తండ్రీ కొడుకులు ఇద్దరితోనూ ఒకేసారి హీరోయిన్ గా నటించనుందన్న మాట ఐష్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/