Begin typing your search above and press return to search.

ఫార్ములా ఎక్స్ పైర్ అయింది!

By:  Tupaki Desk   |   20 Oct 2015 5:30 PM GMT
ఫార్ములా ఎక్స్ పైర్ అయింది!
X
ఫస్టాఫ్ ఏదో ఒక సెటప్ చేసేసి.. సెకండాఫ్ కి వచ్చేసరికి యూనిట్ మొత్తాన్ని ఓ ఇంటికి తెచ్చేయడం, ప్రాసలు పంచ్ లు పట్టుకుని.. బ్రహ్మీలాంటి ఓ కేరక్టర్ ని పెట్టుకుని.. అందరినీ బకరాలు చేయడం. ఇదీ శ్రీనువైట్ల-కోన వెంకట్ ల కాంబినేషన్ లో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నిటి ఫార్ములా. ఈ ఫార్మాట్ ముగింపు స్టేజ్ కి వచ్చేసింది.

ఒకసారి అదే ఫార్మాట్ తో దూకుడు హిట్ కొట్టిన మహేష్ బాబు.. రెండోసారి ఆగడు అంటూ చేసి, ఘోరమైన ఫ్లాప్ ని చవి చూశాడు. అప్పటివరకూ చాలా మూవీస్ వచ్చినా.. ఇదే లైన్ తో సినిమా చేసేందుకు మిగతావాళ్లు భయపడి, హారర్ కామెడీలు ట్రై చేయడం మొదలుపెట్టారు. కానీ సడెన్ గా రామ్ చరణ్ వైట్ల-కోన ఫార్ములాతో సినిమా చేసేందుకు ఒప్పుకుని ఆశ్చర్యపరిచాడు. అయితే జనాలు పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు.

ఇదే ఫార్ములాతో వచ్చిన లౌక్యం - పండగచేస్కో లాంటి అడపాదడపా చిన్న చిన్న హిట్స్ పడుతున్నా.. అవి వేరే ఏ మూవీస్ లేనపుడు మాత్రమే. పెద్ద హీరోలను రెగ్యులర్ ఫార్ములాతో చూసేందుకు ఫ్యాన్స్ ఇష్టపడ్డంలేదు. ఇప్పటికైనా ఈ ఫార్ములాకి ఎక్స్ పైరీ డేట్ పూర్తయిపోయిందని.. డైరెక్టర్స్ అర్దం చేసుకుంటే బెటర్.