Begin typing your search above and press return to search.

ఉపాసన, సితార బర్త్ డేలకు చరణ్, మహేష్ ట్రీట్

By:  Tupaki Desk   |   21 July 2018 4:38 AM GMT
ఉపాసన, సితార బర్త్ డేలకు చరణ్, మహేష్ ట్రీట్
X
స్టార్ హీరోలు కూడా ప్రేమకు అతీతులు కారు.. తమకు కావాల్సిన వారి పుట్టిన రోజును ఘనంగా జరపడానికి వెనుకాడరు. తెలుగు తెరపై స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న రాంచరణ్, మహేష్ బాబులు ప్రస్తుతం బర్త్ డే మూడ్ లో ఉన్నారు. చరణ్ తన భార్య పుట్టిన రోజును ఘనంగా జరపగా.. మహేష్ బాబు తన గారాల పట్టి సితార పాప బర్త్ డే ఆనందంగా జరుపుకున్నారు.

శుక్రవారం ఉపాసన పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ రాంచరణ్ తన సోషల్ మీడియా పేజీలో ఓ పోస్టు చేశాడు. దీని ద్వారా భార్యపై తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఉపాసన తన పక్కన ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పాడు. చరణ్ విష్ చేయడంతో ఉపాసనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

‘నువ్వు దయాగుణం గల వ్యక్తివి. నువ్వు పెంటాస్టిక్, అమేజింగ్, బ్యూటిఫుల్.. నా పక్కన ఉంటే మరింత సంతోషంగా ఉంటాను. హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ’ రాంచరణ్ తన భార్యకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ఇదే రోజు మహేష్ బాబు కూతురు సితార బర్త్ డే కూడా. ఈ సందర్భంగా మహేష్ ఇంట్లోనే పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు. మహేష్ కూతురు బర్త్ డే సందర్భంగా చరణ్ కూడా స్పందించాడు. ‘త్వరలోనే నిన్ను కలుస్తాను.. నువ్వు నా కోసం పాట పాడాలని’ సూచించారు. కూతురు బర్త్ డే సందర్భంగా మెగా చైల్డ్ హెల్త్ క్యాంపును కూడా మహేష్-నమ్రతలు నిర్వహించారు.