Begin typing your search above and press return to search.

ఖాకీలో దొరికేసిన చెర్రీ అండ్ దోస్త్

By:  Tupaki Desk   |   1 July 2016 4:23 AM GMT
ఖాకీలో దొరికేసిన చెర్రీ అండ్ దోస్త్
X
లేటెస్ట్ మూవీ ధృవ కోసం రామ్ చరణ్ చాలానే జాగ్రత్తలు తీసుకున్నాడు. తని ఒరువన్ ని రీమేక్ చేయాలని ఫైనల్ చేసినా.. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయినా.. స్పాట్ కి వచ్చేందుకు చెర్రీ చాలా లేట్ చేశాడు. తన పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు చెర్రీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో ఎవరికీ అర్ధం కాలేదు కానీ.. ఇప్పుడు ఖాకీ డ్రస్ లో చెర్రీ ఫోటో చూస్తే అన్నింటికీ ఆన్సర్ దొరికేస్తుంది.

గతంలో కూడా తుఫాన్ మూవీలో చరణ్ పోలీస్ డ్రెస్ లో కనిపంచాడు చరణ్. కానీ ఆ సినిమా అంతగా క్లిక్ కాలేదు. పైగా పోలీస్ రోల్ చేస్తూ.. గెటప్ విషయంలో ఛేంజ్ చూపించకపోవడంతో విమర్శలు కూడా వచ్చాయి. ఈ సారి మాత్రం పోలీస్ డ్రస్ కి.. ఐపీఎస్ ఆఫీసర్ రోల్ కి పూర్తిగా న్యాయం చేయాలని చరణ్ ముందే డిసైడ్ అయ్యాడు. అందుకే నెలల తరబడి వెజిటేరియన్ ఫుడ్ నే తినడం.. మార్షల్ ఆర్ట్స్ అకిడో నేర్చుకోవడం లాంటివి చేస్తూనే ఉన్నాడు. వాటన్నిటి ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తోంది.

అచ్చమైన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అదిరిపోయే లుక్ లో ఉన్నాడు చరణ్. పక్కనే మరో పోలీస్ పాత్రలో నవదీప్ కూడా సూపర్బ్ గా ఉన్నాడు. 'చరణ్ ఫెంటాస్టిక్ అంతే. అసలు ఏ బ్యాగేజ్ లేకుండా ఉండే ఇలాంటి కో-స్టార్ అరుదుగా ఉంటారు. చరణ్ లాంటి ఎనర్జిటిక్ పర్సన్ తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది' అని నవదీప్ చెబుతున్నాడు. కాశ్మీర్ షెడ్యూల్ ని ఫినిష్ చేసిన చెర్రీ.. ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా హైద్రాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేసేయడం విశేషం.