Begin typing your search above and press return to search.

ఈ లెక్కన చూస్తే ప్రభాస్‌ లాగే మా హీరోలు కూడా గ్రేటే

By:  Tupaki Desk   |   8 Feb 2020 2:30 AM GMT
ఈ లెక్కన చూస్తే ప్రభాస్‌ లాగే మా హీరోలు కూడా గ్రేటే
X
‘మిర్చి’ చిత్రం తర్వాత ప్రభాస్‌ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు పూర్తిగా బాహుబలి చిత్రానికే కేటాయించాడు. ఒక యంగ్‌ హీరో.. అది కూడా మాంచి ఫామ్‌ లో ఉన్న హీరో సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసుకుంటే కోట్లాది పారితోషికం దక్కించుకునే హీరో అన్ని సంవత్సరాలు ఒక్క సినిమాకు వెయిట్‌ చేయడం.. దర్శకుడిని నమ్మి బాహుబలి సినిమా తప్ప మరే సినిమాను ఆ సమయంలో చేయక పోవడం చాలా గొప్ప విషయం అంటూ లోకల్‌ మీడియా నుండి జాతీయ మీడియా వరకు ప్రభాస్‌ గురించి కథనాలు రాశాయి. ఎంతో మంది ప్రముఖులు.. స్టార్స్‌ కూడా ప్రభాస్‌ ను ఇదే విషయం చెబుతూ ప్రశంసిస్తూ ఉంటారు.

ఇటీవల అల వైకుంఠపురంలో చిత్రం సక్సెస్‌ వేడుకలో బన్నీ మాట్లాడుతూ ప్రభాస్‌ అంత కాలం ఒక సినిమాకు పని చేశాడు కనుక ఆ విషయానికి అతడు అర్హుడే అంటూ కామెంట్‌ చేసిన విషయం తెల్సిందే. బాహుబలి కోసం ప్రాణం పెట్టి చేసినందుకు ప్రభాస్‌ ను తెలుగు ఇండస్ట్రీ మొత్తం అభినందించింది.. ఇంకా అభినందిస్తూనే ఉంటుంది. ఇన్నాళ్లు ప్రభాస్‌ ను మాత్రమే అభినందించిన వారంతా కూడా ఇకపై రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లను కూడా అభినందించాల్సిందే అని.. ప్రభాస్‌ లాగే ఈ ఇద్దరు స్టార్స్‌ కూడా అందరి ప్రశంసలకు అర్హులు అంటూ నందమూరి మరియు మెగా అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

వీరిద్దరి మార్కెట్‌ విలువ ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరు సంవత్సరంలో రెండు సినిమాలు చేసుకుంటే వారికి దక్కే పారితోషికం చాలా చాలా ఎక్కువ. అయినా కూడా ఆర్‌ ఆర్‌ ఆర్‌ చిత్రం కోసం వారి కెరీర్‌ లోని కీలకమైన రెండు సంవత్సరాలకు పైగా టైంను జక్కన్నకు ఇచ్చేస్తున్నారు. ప్రభాస్‌ మాదిరిగానే వీరిద్దరు కూడా జక్కన్నను పూర్తిగా నమ్మేశారు. కనుక వీరు కూడా ఆ అభినందనలకు అర్హులే అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక ఆర్‌ ఆర్‌ ఆర్‌ చిత్రం విడుదల వాయిదా విషయం అధికారికంగా ప్రకటించి కొత్త తేదీని ప్రకటించినప్పటి నుండి కూడా సోషల్‌ మీడియాలో మీమ్స్‌ ఫుల్‌ గా వస్తున్నాయి. జక్కన్నతో చేయాలి చేయాలని అనుకున్నందుకు బాగా పెట్టాడుగా ఫిటింగ్‌.. ఎవరితో అయినా పెట్టుకో కాని జక్కన్నతో పెట్టుకుంటే ఇంతే.. అంటూ ఫన్నీ మీమ్స్‌ ను తెగ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేలా చేస్తున్నారు. ఇప్పుడు నందమూరి మరియు మెగా ఫ్యాన్స్‌ జక్కన్నను కనీసం 2021లో అయినా తమ హీరోల సినిమాను విడుదల చేయమని.. మళ్లీ వాయిదా వేసి 2022 అంటూ ప్రకటించొద్దంటూ ఫన్నీగా విజ్ఞప్తులు చేస్తున్నారు.