Begin typing your search above and press return to search.
RRR ట్రైలర్: అగ్గి పిడుగు అల్లూరి - గోండు బెబ్బులి భీమ్ ల గర్జన..!
By: Tupaki Desk | 9 Dec 2021 9:40 AM GMTయావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్'' (రౌద్రం రుధిరం రణం) ట్రైలర్ వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ఈ భారీ మల్టీస్టారర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాటికి ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ కట్ చేశారు రాజమౌళి.
'బాహుబలి' తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన జక్కన్న.. మరో విజువల్ వండర్ ని తెర మీద ఆవిష్కరించారని RRR ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ వంటి ఇద్దరు మహావీరుల నిజ జీవిత పాత్రల ఆధారంగా అద్భుతమైన ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా తారక్ అదరగొట్టారని ట్రైలర్ చూసి చెప్పొచ్చు.
జనవరి 7వ తేదీన జరగబోయే విధ్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో.. లేటెస్టుగా విడుదలైన 3.07 నిమిషాలు 'ఆర్.ఆర్.ఆర్' ట్రైలర్ వెల్లడిస్తోంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలసి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నారని అర్థం అవుతోంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి శైలి ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ ఘట్టాలు - రోమాలు నిక్కబొడుచుకునే ఎలివేషన్ సీన్స్ - కన్నీళ్లు తెప్పించే ఎమోషనల్ సన్నివేశాలు కలబోసిన ఈ ట్రైలర్ ప్రేక్షకులకు ఆధ్యంత ఆకట్టుకుంటోంది.
RRR ట్రైలర్ లోకి వెళ్తే.. గోండు ప్రజల కాపరిగా.. పులితో ఫైట్ చేస్తున్న బెబ్బులి కొమురం భీమ్ గా ఎన్టీఆర్ ను చూపించడంతో ప్రారంభమవుతుంది. ఆ బెబ్బులి ని పట్టుకునే వేటగాడిగా.. బ్రిటీష్ వారి ఆధీనంలో పని చేసే పోలీస్ రామరాజుగా రామ్ చరణ్ ని పరిచయం చేసారు. ఒక గోండు గిరిజన బాలికను బ్రిటీష్ వారు బలవంతంగా తీసుకెళ్లిపోగా.. ఆ చిన్నారిని రక్షించడానికి భీమ్ వేషం మార్చి రామరాజుతో స్నేహం చేసినట్లు కనిపిస్తోంది.
ఈ క్రమంలో రామరాజు - భీమ్ ల మధ్య ఏర్పడిన స్నేహాన్ని వైరాన్ని ఈ ట్రైలర్ లో చూపించారు. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు భీమ్ ను రామరాజు అరెస్ట్ చేయడం.. భీమ్ ను రామరాజు కొట్టడం.. సీత పాత్రలో నటించిన అలియా భట్ ను పోలీసులు కాలితో తన్నడం.. భీమ్ చేతిలో రామరాజు దెబ్బలు తినడం వంటి సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. అయితే ఆ తర్వాత తారక్ - చరణ్ ఇద్దరూ కలిసి బ్రిటీష్ వారి మీద యుద్ధం చేసినట్లు అర్థం అవుతుంది.
నిప్పుకు ప్రతీకగా అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. నీటికి ప్రతీకగా కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటన చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదనడంలో అతిశయోక్తి లేదు. ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ లు - ఫైట్స్ అభిమానులకు గూస్ బమ్స్ తెప్పిస్తాయడంలో సందేహం లేదు. ముఖ్యంగా అల్లూరి గెటప్ లో విల్లు చేతబట్టి నిప్పుల్లోంచి చరణ్ బాణాలు విసరడం.. పులికి ఎదురొడ్డి తారక్ గర్జించడం వంటి సీన్స్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే.
అలానే బైక్ ని తన్ని ఎన్టీఆర్ చేత్తో దాన్ని హ్యండిల్ చేయడం.. చరణ్ గుర్రం మీద దూసుకురావడం అదిరుపోయింది. చివరల్లో తారక్ - చెర్రీ కలిసి టవర్ పైకి ఎక్కే యాక్షన్ సీన్ ట్రైలర్ కే హైలెట్ గా చెప్పొచ్చు. 'పాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంత అన్నా..' 'తొంగి తొంగి నక్కి నక్కి కాదే.. తొక్కుకుంటూ పోవాలే.. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలే..' అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్.. 'భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం పదా' అంటూ చరణ్ చెప్పే డైలాగ్ ప్రేక్షకులతో విజిల్స్ వేయిసస్తున్నాయి.
'యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి' అని అజయ్ దేవగన్ చెప్పడం అతని పాత్ర స్వభావాన్ని తెలియజేస్తోంది. ఇందులో చరణ్ కు జోడీగా అలియా.. తారక్ కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. సముద్ర ఖని - శ్రియా - రాజీవ్ కనకాల - హాలీవుడ్ నటులు అలిసన్ డూడీ - రే స్టీవెన్ సన్ కనిపించింది ఒక్క సీన్ లోనే అయినా ఆకట్టుకున్నారు.
ఎంఎం కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ - కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ 'ఆర్.ఆర్.ఆర్' కు ఆయువుపట్టుగా నిలిచాయని చెప్పవచ్చు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేశారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ 'ఆర్.ఆర్.ఆర్' కథ రాయగా.. బుర్రా సాయి మాధవ్ తెలుగు డైలాగ్స్ అందించారు. డి.పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు.
తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదలై RRR ట్రైలర్ అనూహ్య స్పందనతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. రాజమౌళి మరోసారి వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారని ట్రైలర్ చూసి చెప్పొచ్చు. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు - టీజర్లు - 'దోస్తీ' 'నాటు నాటు' 'జనని' పాటలు విశేషంగా అలరించాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మాగ్నమ్ ఓపస్ 2022 జనవరి 7న గ్రాండ్ గా విడుదల కానుంది.